AP Congress 2nd List: 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
- Author : Praveen Aluthuru
Date : 09-04-2024 - 11:25 IST
Published By : Hashtagu Telugu Desk
AP Congress 2nd List: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో మరో ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతా మోహన్, నరసరావుపేట నుంచి సుధాకర్, నెల్లూరు- కొప్పుల రాజు, అనకాపల్లి – వేగి వెంకటేష్, విశాఖ- సత్యనారాయణ రెడ్డి, ఏలూరు నుంచి కావూరి పోటీ చేయనున్నారు. వైసీపీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌లో 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు 11 లోక్‌సభ, 126 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
6 ఎంపీ అభ్యర్థులు:
నరసరావుపేట- సుధాకర్
నెల్లూరు- కొప్పుల రాజు
తిరుపతి- చింతామోహన్
విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
ఏలూరు- లావణ్య
అనకాపల్లి- వెంకటేష్
12 ఎమ్మెల్యే అభ్యర్థులు:
టెక్కలి- కిల్లి కృపారాణి
భిమిలి- వెంకటవర్మరాజు
విశాఖ సౌత్- సంతోష్
గాజువాక- రామారావు
అరకు- గంగాధర స్వామి
నర్సీపట్నం- శ్రీరామమూర్తి
గోపాలపురం- మార్టిన్ లూథర్
యర్రగొండుపాలెం- అజితారావు
పర్చూరు- శివశ్రీలక్ష్మిజ్యోతి
సంతనూతలపాడు- విజేష్‌రాజ్ పాలపర్తి
జి.నెల్లూరు౦- రమేష్‌బాబు
పూతలపట్టు- ఎం.ఎస్.బాబు
Also Read: PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు