HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Issues Key Orders To Strengthen It In Ap

CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.

  • Author : Gopichand Date : 21-07-2025 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిని, ఐటీ పరిశ్రమలను బలోపేతం చేయడానికి విస్తృత ప్రణాళికలను ఆవిష్కరించారు. రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి, విశాఖ, అమరావతి, తిరుపతిలలో ఐటీ కంపెనీలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నూతనంగా రూపొందించిన ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0’పై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ రంగాల్లో పెట్టుబడులను భారీగా ఆకర్షించాలని సూచించారు.

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి రాయలసీమ కేంద్రం

ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తిరుపతి సమీపంలోని శ్రీసిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భూమి లభ్యత సమస్యలున్నందున, ఆంధ్రప్రదేశ్‌కు ఇది సానుకూల అంశమని ఆయన పేర్కొన్నారు.

Also Read: Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ

‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0’ లక్ష్యాలను అధికారులు వివరించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే ఈ విధానం లక్ష్యం. గత ఏడాది దేశంలో 70 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీ డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో ‘సెల్ఫ్-రిలయన్స్’ (ఆత్మనిర్భరత), ‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాలు నెరవేరాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌ను తీర్చగల భారీస్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఏపీలో ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్‌ను సృష్టించడం అనేది కీలకమని ఆయన నొక్కి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకోసిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రంగంలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఐటీ విస్తరణకు మూడు రీజియన్ల ప్రణాళిక

ఐటీ రంగ అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి సారించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన అన్నారు. విశాఖలో ఐటీ/ఐటీఈఎస్ సంస్థలతో పాటు, లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఈ ప్రాంతాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. యువతను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం నైపుణ్యం పోర్టల్‌తో ఇతర పోర్టల్స్‌ను కూడా అనుసంధానించాలని ఆదేశించారు. విద్యా రంగంలో కొత్త పాఠ్యాంశాలను జోడించడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలు లభించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నాలెడ్జి ఎకానమీలో ఏపీ నంబర్ వన్‌గా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • nda govt
  • Rayalaseema

Related News

Bullet Railway Andhra Prade

ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

Latest News

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd