Avinash Reddy Escape: అమ్మతోడు .. అవినాష్ ఎస్కేప్
అస్వస్థతకు గురైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) తల్లి వైఎస్ లక్ష్మిని చికిత్స కోసం కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు.
- By CS Rao Published Date - 07:00 PM, Fri - 19 May 23

Avinash Reddy Escape : అస్వస్థతకు గురైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) తల్లి వైఎస్ లక్ష్మిని చికిత్స కోసం కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అంతకు ముందు హైదరాబాద్ కు అంబులెన్స్ లో బయలుదేరిన ఆమెను అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరామర్శించి అదే అంబులెన్స్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) హైద్రాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఆమెను కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. కర్నూల్ ఆసుపత్రి వైద్యులు వైఎస్ లక్ష్మికి చికిత్స అందించారు. తల్లితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.
శుక్రవారం కావడంతో వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఉపవాస దీక్షలు ఉన్నాయి.. ఉదయం నుంచి ఏమీ తీసుకోకపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడంతో పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించాలని వైద్యలు నిర్ణయించారు.
ఇలాఉంటే నేడు సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో తల్లికి అనారోగ్యం గురించి కడప ఎంపీకి సమాచారం అందింది. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు. తల్లికి అనారోగ్యం గురించి సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్లు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లి వస్తున్న అంబులెన్స్ అవినాష్ రెడ్డికి ఎదురైంది. అక్కడే తల్లిని అవినాష్ రెడ్డి పరామర్శించారు. అదే అంబులెన్స్ లో తల్లితో పాటు కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు.
వైయస్సార్సీపి ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి కి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి తరలించారు. విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో తల్లి వెంటే ఉన్న అవినాశ్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లడంపై నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Avinash Reddy Story: అమ్మ దొంగా.. అవినాష్!మే 26కథ అదేనా!