Aatchutapuram Sez Accident: 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు!
అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు.
- By Gopichand Published Date - 09:05 AM, Thu - 22 August 24

Aatchutapuram Sez Accident: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మందుల తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం ప్రకారం పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో (Aatchutapuram Sez Accident) 381 మంది ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో పేలుడు సంభవించింది. 50 మందికి పైగా ప్రమాదంలో గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని మందుల తయారీ కర్మాగారంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. స్థానిక యంత్రాంగం ప్రకారం.. ప్రమాదం సమయంలో యూనిట్‌లో చిక్కుకున్న 13 మందిని రక్షించారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించారు.
Also Read: Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!
సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు
ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో పాటు ప్రజల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదం గురించి అనకాపల్లి జిల్లా మెజిస్ట్రేట్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ.. జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న ఎస్సెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మధ్యాహ్నం 2:15 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో రెండు షిఫ్టుల్లో 381 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భోజన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రమాదం జరిగిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు
అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.