HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >2025 Central Budget Telangana And Ap Expectations

Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!

Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.

  • By Kavya Krishna Published Date - 10:12 AM, Sat - 1 February 25
  • daily-hunt
Amaravati, Hyderabad Metro
Amaravati, Hyderabad Metro

Union Budget 2025: తెలుగు రాష్ట్రాలు 2025 కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. రెండు రాష్ట్రాలు ఉచిత పథకాల కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంతో, ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎంత సాయం అందిస్తుందో అన్న ప్రశ్న కీలకంగా మారింది. భారీ ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు ఉంటుంది కాని, రాష్టాలు కేంద్రం నుంచి ఎంత నిధులు పొందుతాయనేది నిర్ధారించాలి.

Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ

అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి నిధుల అభ్యర్థన
గత బడ్జెట్‌లో అమరావతి నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించగా, ఇవి అప్పుల రూపంలో ఉండి, అందువల్ల పనులు వేగంగా కొనసాగించడం కష్టం కావడంతో, ఈసారి మరిన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దావోస్ టూర్ అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యి, అవసరమైన నిధులపై చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇదేకాకుండా.. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం, అమరావతి నిర్మాణం కోసం కేంద్రం వద్ద హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ. 12,500 కోట్లను కేటాయించగా, ఇది 2028 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను త్వరగా మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.

ఆర్ఆర్ఆర్, మెట్రో రెండో దశ.. భారీ నిధుల అభ్యర్థన
తెలంగాణ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం రూ. 34,367 కోట్లు, హైదరాబాద్ మెట్రో రెండో దశకు రూ. 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం రూ. 14,100 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద నిధులు కేటాయించాలని కోరుతోంది. ఇవి కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రానికి రూ. 1800 కోట్లకు పైగా రావాల్సి ఉంది.

రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవన తదితర ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రధాని మోదీని కలసి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దన్న మాదిరిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అందించబడే నిధుల ఆధారంగా, రాష్ట్రాలు తమ బడ్జెట్‌ను తయారు చేయనున్నారు.

Sit and Work : ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Central Budget
  • amaravati
  • andhra pradesh
  • Budget Expectations
  • hyderabad metro
  • Moosie Revitalization
  • nirmala sitharaman
  • polavaram
  • rrr
  • telangana
  • telugu states

Related News

Mantena Ramaraju Donated Ttd

Mantena Ramaraju : కూతురి పెళ్లికి రూ.100 కోట్లు..తిరుమల శ్రీవారికి NRI రామరాజు కళ్లు చెదిరే విరాళం!

తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. రామలింగరాజు అనే భక్తుడు తన కుమార్తె, అల్లుడి పేరు మీద రూ.9 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. మరోవైపు, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తన్మయత్వం పొందారు. శ్రీవారి ఆలయం నుంచి సారె, విల

  • Guntur Government Hospital

    Superintendent : సినిమా సీన్ రిపీట్..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో!

  • Annadata Sukhibhava

    Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

  • Telangana Wine Shops

    Grama Panchayat Elections : తెలంగాణ కొత్త మద్యం షాపులకు ‘పంచాయితీ ఎన్నికల’ కిక్కు!

  • Sarpanch Election Schedule

    Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

Latest News

  • AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?

  • Komatireddy Brothers : కాంగ్రెస్ కు కుంపటిగా కోమటిరెడ్డి బ్రదర్స్..?

  • Suryakumar Yadav : ఆస్ట్రేలియాపై రివేంజ్..టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌‌ ప్రత్యర్థిపై సూర్య రిప్లయ్!

  • Telangana Global Summit : పెట్టుబడులకు కేరాఫ్‌గా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ – సీఎం రేవంత్

  • Jagan – Lokesh : జగన్ కు లోకేష్ కు తేడా ఇదే..దటీజ్ లోకేష్ అన్న !!

Trending News

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd