US Man Kills Family: అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులని కాల్చి చంపిన భర్త
అమెరికాలో దారుణం జరిగింది. భార్య విడాకులకు దరఖాస్తు చేసిందనే కోపంతో భర్త మృగంలా మారాడు. భార్యతో సహా ఏడుగురు కుటుంబసభ్యులను కాల్చి (US Man Kills Family) చంపాడు. ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురితో కూడిన తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడో వ్యక్తి.
- By Gopichand Published Date - 07:27 AM, Sat - 7 January 23

అమెరికాలో దారుణం జరిగింది. భార్య విడాకులకు దరఖాస్తు చేసిందనే కోపంతో భర్త మృగంలా మారాడు. భార్యతో సహా ఏడుగురు కుటుంబసభ్యులను కాల్చి (US Man Kills Family) చంపాడు. ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురితో కూడిన తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది. తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతోనే ఈ దారుణానికి తెగించాడని, కుటుంబంలోని ఏడుగురి మీద తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడని అమెరికా అధికారులు గురువారం తెలిపారు.
సన్నిహితులు, బంధువులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మైఖేల్ హైట్ అనే వ్యక్తి తన కుటుంబంలోని ఏడుగురిని చంపి, ఆపై ఎనోచ్ సిటీలోని కుటుంబంలోని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఆధారాలు వెల్లడించాయని అధికారులు తెలిపారు. ఎనోచ్ సిటీలోని చిన్నదైన ఉటా సెటిల్‌మెంట్‌లో పోలీసులు ఈ మేరకు ఎనిమిది మృతదేహాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి నాలుగేళ్ల వయస్సు చిన్నారి కూడా ఉండడం అందర్నీ కలిచివేస్తోంది. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ఐదుగురు పిల్లల మృతదేహాలను కనుగొన్నామని తెలిపారు. వీరంతా తుపాకీ గాయాలతో మరణించారని తెలిపారు.
Also Read: Donald Trump Gets One Vote: అమెరికా దిగువ సభ స్పీకర్ ఎన్నికలో అనూహ్య ఘటన.. ట్రంప్ కి ఒకే ఒక ఓటు
తౌషా హైట్ డిసెంబర్ 21న మైఖేల్ హైట్ నుండి విడాకుల కోసం దాఖలు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఒకేసారి ఏడు హత్యలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసులో నేరానికి సంబంధించి ఇంకెవరి కోసం వెతకడం లేదని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి నిర్వహించిన వెల్ఫేర్ చెకింగ్‌లో ఆ ఇంటి వాళ్లంతా చనిపోయారనే విషయం వెలుగులోకి వచ్చింది. కాల్పుల ఘటనుకు కారణం విడాకుల వివాదమే అని ఎనోక్ మేయర్ జియోఫ్రే చెస్‌నట్ తెలిపాడు.