HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trumps Glare Gold Prices Drop Sharply

Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

  • Author : Vamsi Chowdary Korata Date : 24-10-2025 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump Gold
Donald Trump Gold

బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. వీటి అనుబంధ సంస్థలపై కూడా ఇవే ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ రెండు కంపెనీలు.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముదిరేందుకు నిధులు అందిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. యుద్ధాన్ని ముగించేందుకు మరిన్ని చర్యలకు కూడా సిద్ధమేనని ప్రకటించింది. ఇదే సమయంలో ఐరోపా కూటమి కూడా రష్యాపై ఆంక్షల్ని విధించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో.. అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతలు మరోసారి ఆజ్యం పోసుకున్నాయి. ఇటీవల పరిస్థితులు.. కాస్త కుదుటపడినట్లే కనిపించినా అలా జరగలేదు. అమెరికా తమపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని.. తాము దీనికి లొంగబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా చర్యల వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని.. ఇది అందరు వినియోగదారులపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ధరలు పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4120 డాలర్లపై ఉంది. కిందటి రోజు ఇది 4100 డాలర్ల దిగువన ఉండేది. సిల్వర్ రేటు కూడా 49 డాలర్లకు చేరువైంది.

 

దేశీయంగా కూడా బంగారం రేట్లు ఇటీవల భారీగా తగ్గి ఉపశమనం కల్పించగా.. ఇవాళ పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 350 పెరగ్గా తులం రూ. 1,15,000 కు చేరింది. గత 6 రోజుల్లో ఇది రూ. 7050 తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్రముఖ జువెల్లరీల్లో బంగారు ఆభరణాల ధర ఎంత ఉందో తెలుసుకుందాం. లలితా జువెల్లరీ లిమిటెడ్‌లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై గ్రాముకు రూ. 11,500 పలుకుతోంది. తనిష్క్‌లో కాస్త ఎక్కువగా గ్రాము గోల్డ్ రేటు రూ. 11,505 గా ఉంది. కల్యాణ్ జువెల్లర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఖజానా జువెల్లర్స్‌లో కూడా గ్రాము బంగారం ధర రూ. 11,500 గా ఉంది. ఆభరణాలు తీసుకునేటప్పుడు వీటిపై మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఇంకా.. 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూఎస్ ఫెడ్ వచ్చే వారం కీలక వడ్డీ రేట్లను మరో 25 శాతం మేర తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • gold
  • gold price
  • india
  • Russian oil
  • russian ukraine talks
  • USA

Related News

H3N2 Influenza

కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

ఈ సబ్‌క్లేడ్ K ఫ్లూ వేరియంట్ అంటువ్యాధి రూపం. దీనిని "సూపర్‌ఫ్లూ" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది H3N2 రూపాంతరం చెందిన రూపంగా పరిగణించబడుతుంది.

  • LPG Price

    LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

  • Benz Cars Price Hike

    Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

  • Gold And Silver Rate Today

    Gold Price : ఈరోజు బంగారం ధర తగ్గింది.. సిల్వర్ రేటు పెరిగింది !

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

Trending News

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd