Trump Tariffs : ట్రంప్ నోట మరోసారి ‘టారిఫ్స్’ మాట.. టార్గెట్ ఇండియానేనా?
Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తరచూ భారత్‌పై విమర్శలు గుప్పించడం, వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
- By Sudheer Published Date - 09:00 AM, Wed - 1 October 25

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తరచూ భారత్‌పై విమర్శలు గుప్పించడం, వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం లేచినప్పటినుంచీ భారతదేశాన్ని టార్గెట్ చేయడం ఆయన అలవాటుగా మారిందని విమర్శకులు చెబుతున్నారు. తాజాగా ఆయన టారిఫ్‌లపై చేసిన వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి. “ఐ లవ్ టారిఫ్స్… అది చాలా అందమైన పదం… డిక్షనరీలో నాకు ఇష్టమైన పదమిదే” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు
ట్రంప్ వ్యాఖ్యల వెనక అమెరికా వాణిజ్య విధానమే ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆగస్టు నెల నుంచి అమెరికా భారత్, బ్రెజిల్‌లపై అధికంగా 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిందని సమాచారం. దీంతో ఈ రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై భారీ పన్నులు పడుతున్నాయి. ఈ చర్యతో అమెరికా స్వదేశీ పరిశ్రమలకు రక్షణ లభిస్తుందని ట్రంప్ వాదిస్తుంటే, అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు మాత్రం దీని వల్ల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ వరుసగా భారత్‌పై వ్యాఖ్యలు చేయడంతో అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు ఎటు తిరుగుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు నెమ్మదించిన నేపథ్యంలో, ట్రంప్ నిర్ణయాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయని నిపుణుల అభిప్రాయం. త్వరలో ఆయన ఇంకెవరి మీద ఏ విధమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటారో చూడాలని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తన వాణిజ్య వ్యూహాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు సూచిస్తున్నారు.