Solar Storm: దూసుకువస్తున్న సౌర తుఫాను.. నేడు భూమిని తాకే అవకాశం, ఇంటర్నెట్ సేవలకు ఇబ్బంది..!?
ఈరోజు భూమిపై పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిపై నాసా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. దీని ప్రకారం ఈ రోజు అంటే నవంబర్ 30న సౌర తుఫాను (Solar Storm) భూమిని తాకవచ్చు.
- Author : Gopichand
Date : 30-11-2023 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
Solar Storm: ఈరోజు భూమిపై ఏదో ఒక ప్రత్యేకత జరగబోతోంది. విశ్వంలో జరిగే కార్యకలాపాలు మనపై ప్రభావం చూపుతాయి. నిజానికి ఈరోజు భూమిపై పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిపై నాసా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. దీని ప్రకారం ఈ రోజు అంటే నవంబర్ 30న సౌర తుఫాను (Solar Storm) భూమిని తాకవచ్చు. దీని కారణంగా మొబైల్ కమ్యూనికేషన్, GPS, రేడియో సిగ్నల్స్ ప్రభావితం కావచ్చు.
అంతరిక్షంలో జరిగే కార్యకలాపాలపై నిఘా ఉంచే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సూర్యుడి నుండి కరోనల్ మాస్ ఎజెక్షన్ కారణంగా సౌర తుఫాను పరిస్థితి సృష్టించబడుతోంది. అది ఈ రోజు భూమిని తాకవచ్చు. వీటిని CME అని కూడా అంటారు. వాస్తవానికి CMEలు సూర్యుడి నుండి వెలువడే తరంగాలు. వీటిలో పెద్ద మొత్తంలో చార్జ్డ్ ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి. ఇవి భూమిపై ఉన్న ఉపగ్రహాలు,కమ్యూనికేషన్ వ్యవస్థలకు నష్టాన్ని కలిగిస్తాయి.
Also Read: AP High Court : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు
ఇంటర్నెట్ సౌకర్యం ప్రభావితం కావచ్చు
ఇది భూమి దక్షిణ భాగాన్ని తాకుతుందని నిపుణులు కనుగొన్నారు. కాబట్టి దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. GPS సిగ్నల్స్‌పై దీని ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ సోలార్ తుఫాను చాలా పెద్దది కానప్పటికీ, ఇది ఇప్పటికీ ధ్రువాల దగ్గర ఉన్న GPS, రేడియో సిగ్నల్‌లను దెబ్బతీస్తుందని ఆందోళన కలిగిస్తుంది. దీని కారణంగా ఇంటర్నెట్ సేవలు కూడా ప్రభావితం కావచ్చు.
సోలార్ సైకిల్ ప్రతీ 11 ఏళ్లకు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి ధ్రువాలు మారుస్తూ వస్తుంటాయి. ఉత్తర ధ్రువం దక్షిణంగా.. దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతాయి. అయితే భూమిని సౌర తుఫాను తుఫాను తాకినా భూమికి సహజంగా ఉన్న మ్యాగ్నిటిక్ ఫీల్డ్ వాటిని అడ్డుకుంటుంది. సౌర తుఫానుల కారణంగా భూమిపై మానవులతో పాటు జీవజాలానికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.