Russia Offer: భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. చమురు కొనుగోళ్లపై 5 శాతం రాయితీ!
డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చర్యలు తీసుకోకపోతే మాస్కోపై కూడా ఆంక్షలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు.
- By Gopichand Published Date - 08:49 PM, Wed - 20 August 25

Russia Offer: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై ఆగ్రహం వ్యక్తం చేసి 25 శాతం అదనపు టారిఫ్ విధించారు. ఈ నేపథ్యంలో కూడా భారత్ రష్యా (Russia Offer) నుంచి తన అవసరాలకు అనుగుణంగా చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో రష్యా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని భారతదేశానికి చమురు కొనుగోళ్లపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
రష్యాకు చెందిన ఉప-వాణిజ్య ప్రతినిధి ఎవగేనీ గ్రివా మాట్లాడుతూ.. “భారత్‌కు రష్యన్ ముడి చమురు కొనుగోలుపై 5 శాతం రాయితీ ఉంటుంది. ఇది చర్చల ఆధారంగా నిర్ణయించబడుతుంది” అని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ దాదాపు అదే స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుందని ఆయన అన్నారు. ఈ రాయితీ ఒక వాణిజ్య రహస్యమని, ఇది సాధారణంగా వ్యాపారుల మధ్య సంభాషణలపై ఆధారపడి ఉంటుందని, దాదాపు 5 శాతం ఉంటుందని ఆయన వివరించారు.
Also Read: ODI Rankings: తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌ల పేర్లు గల్లంతు.. ఏం జరిగిందంటే?
భారత్-రష్యా ఇంధన సహకారం బలోపేతం
గ్రివాతో పాటు రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ కూడా ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ తమ సంబంధాలపై తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. “బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్-రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం” అని ఆయన అన్నారు. ఇక్కడ ఆయన ‘బాహ్య ఒత్తిళ్లు’ అని అమెరికాను ఉద్దేశించి అన్నారు.
అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా సహాయం చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణతో అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించింది. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో మాట్లాడుతూ.. “భారత్ రష్యా చమురుకు గ్లోబల్ క్లియరింగ్‌హౌస్‌గా పనిచేస్తోంది. నిషేధిత ముడి చమురును అధిక-విలువ గల ఎగుమతులుగా మార్చి మాస్కోకు డాలర్లు అందిస్తోంది” అని ఆరోపించారు.
ట్రంప్ రష్యాను కూడా హెచ్చరించారు
డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చర్యలు తీసుకోకపోతే మాస్కోపై కూడా ఆంక్షలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కూడా ఆంక్షలు విధిస్తామని ఆయన చెప్పారు. రష్యా చమురుకు చైనా, భారత్ అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి.