HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Pakistan Again Violated Ceasefire On Loc

Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!

పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.

  • Author : Gopichand Date : 26-04-2025 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India–Pakistan border
India–Pakistan border

Pakistan Ceasefire: పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు (Pakistan Ceasefire) జరిపింది. దీనికి భారత సైన్యం దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ కాల్పులు పాకిస్తాన్ వైపు నుంచి ఎల్‌ఓసీలోని అనేక చౌకీల నుంచి జరిగాయి. అయితే, ఇందులో భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.
ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో దాడి చేసింది. కానీ మా సైన్యం దానికి తగిన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం నమోదు కాలేదని చెప్పారు.

సైన్యం అధికారి జారీ చేసిన ప్రకటన

సైన్యం అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ” ఏప్రిల్ 25, 26 పాకిస్థాన్ సైన్యం అనేక చౌకీల నుంచి కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద ఎలాంటి రెచ్చగొట్టే చర్య లేకుండా చిన్న తుపాకులతో కాల్పులు జరిపింది. భారత సైన్యం చిన్న ఆయుధాలతో సరైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.” అని పేర్కొంది.

పాకిస్తాన్‌పై భారత్ చర్యలు ప్రారంభం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, నిరపరాధుల హత్య తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం సింధూ నది జల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్‌ను నీటి ఒక్క చుక్క కోసం కూడా ఆరాటపడేలా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్‌కు ఇకపై ఒక్క చుక్క నీరు కూడా పంపకూడదని నిర్ణయించారు. దీని కోసం వెంటనే పని ప్రారంభించాలని తీర్మానించారు.

Also Read: Donald Trump: భార‌త్‌, పాక్ నాకు స‌న్నిహిత దేశాలు.. ఉగ్ర‌దాడిపై ట్రంప్ స్పంద‌న ఇదే!

సమావేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చ జరిగింది. సింధూ నది నుంచి ఒట్టి (సిల్ట్) తొలగించడం, డ్రెడ్జింగ్ పనిని త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే నది నీటిని ఇతర నదులకు మళ్లించే ప్రణాళికపై కూడా చర్చ జరిగింది. తద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో దీనిని ఉపయోగించవచ్చు. ఈ నీటితో నీటిపారుదల ఎలా చేయాల? కొత్త ఆనకట్టలు ఎలా నిర్మించాలి అనే అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సమావేశంలో కొద్ది సేపు పాల్గొన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ceasefire
  • india
  • LoC
  • Pahalgam
  • Pahalgam Terrorist attack
  • pakistan
  • Pakistan Ceasefire
  • terrorist attack

Related News

Indian Money

Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

SBI నివేదిక ప్రకారం, ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న నగదులో 97.6% నేరుగా ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. అయితే, నగదు నిల్వలు పెరిగినప్పటికీ, దేశ జిడిపి (GDP)లో నగదు నిష్పత్తి మాత్రం 14.4% (2021) నుండి 11% (2026) కి తగ్గింది.

  • Mohsin Naqvi

    భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

  • IND vs PAK

    భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd