Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.
- By Gopichand Published Date - 09:45 AM, Sat - 26 April 25

Pakistan Ceasefire: పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు (Pakistan Ceasefire) జరిపింది. దీనికి భారత సైన్యం దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ కాల్పులు పాకిస్తాన్ వైపు నుంచి ఎల్‌ఓసీలోని అనేక చౌకీల నుంచి జరిగాయి. అయితే, ఇందులో భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదు.
ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో దాడి చేసింది. కానీ మా సైన్యం దానికి తగిన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం నమోదు కాలేదని చెప్పారు.
సైన్యం అధికారి జారీ చేసిన ప్రకటన
సైన్యం అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ” ఏప్రిల్ 25, 26 పాకిస్థాన్ సైన్యం అనేక చౌకీల నుంచి కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద ఎలాంటి రెచ్చగొట్టే చర్య లేకుండా చిన్న తుపాకులతో కాల్పులు జరిపింది. భారత సైన్యం చిన్న ఆయుధాలతో సరైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.” అని పేర్కొంది.
పాకిస్తాన్‌పై భారత్ చర్యలు ప్రారంభం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, నిరపరాధుల హత్య తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం సింధూ నది జల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్‌ను నీటి ఒక్క చుక్క కోసం కూడా ఆరాటపడేలా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్‌కు ఇకపై ఒక్క చుక్క నీరు కూడా పంపకూడదని నిర్ణయించారు. దీని కోసం వెంటనే పని ప్రారంభించాలని తీర్మానించారు.
Also Read: Donald Trump: భారత్, పాక్ నాకు సన్నిహిత దేశాలు.. ఉగ్రదాడిపై ట్రంప్ స్పందన ఇదే!
సమావేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చ జరిగింది. సింధూ నది నుంచి ఒట్టి (సిల్ట్) తొలగించడం, డ్రెడ్జింగ్ పనిని త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే నది నీటిని ఇతర నదులకు మళ్లించే ప్రణాళికపై కూడా చర్చ జరిగింది. తద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో దీనిని ఉపయోగించవచ్చు. ఈ నీటితో నీటిపారుదల ఎలా చేయాల? కొత్త ఆనకట్టలు ఎలా నిర్మించాలి అనే అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సమావేశంలో కొద్ది సేపు పాల్గొన్నారు