HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Pak Pm Shahbaz Sharif Boasted In His Speech During Independence Day Celebration

PAK PM Shahbaz Sharif: భార‌త్‌పై పాక్ ప్ర‌ధాని వివాదాస్పద వ్యాఖ్య‌లు!

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని "చారిత్రాత్మక విజయం"గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి.

  • By Gopichand Published Date - 05:25 PM, Thu - 14 August 25
  • daily-hunt
PAK PM Shahbaz Sharif
PAK PM Shahbaz Sharif

PAK PM Shahbaz Sharif : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PAK PM Shahbaz Sharif ) పాకిస్తాన్ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భారత్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఆపరేషన్ సింధూర్ యుద్ధం గురించి అసత్య ప్రచారం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు

ఆగస్టు 14న పాకిస్తాన్ 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని షెహబాజ్ షరీఫ్ తన X (గతంలో ట్విట్టర్) ఖాతాలో శుభాకాంక్షలు తెలియజేశారు. తన పోస్ట్‌లో పాకిస్తాన్ సృష్టికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా, అల్లామా మొహమ్మద్ ఇక్బాల్‌లను ఆయన కొనియాడారు.

అయితే, భారత్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. భారత్ మాపై యుద్ధాన్ని రుద్దింది. కానీ పాకిస్తాన్ ఈ యుద్ధంలో చారిత్రాత్మక విజయం సాధించింది అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దీనితో పాటు పాకిస్తాన్ సైన్యం తమ గౌరవాన్ని నిలబెట్టుకుని శత్రువు అహంకారాన్ని ధ్వంసం చేసిందని, వీర సైనికులు శత్రువును మోకాళ్లపైకి దిగజార్చారని ఆయన అన్నారు. ఈ విజయం తమ ప్రజలలో దేశభక్తిని పెంచిందని ఆయన పేర్కొన్నారు.

Also Read: UP : సీఎంను పొగిడినందుకు ఎమ్మెల్యే ను సస్పెండ్ చేసిన అఖిలేశ్ యాదవ్

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత్ 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. దీనిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడుల తరువాత పాకిస్తాన్ సైన్యం భారత నగరాలపై దాడులు చేయడానికి ప్రయత్నించగా భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ సైనిక శిబిరాలపై కూడా ప్రతిదాడి చేసింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని “చారిత్రాత్మక విజయం”గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి. పాకిస్తాన్ సంస్కరణలకు నోచుకోకుండా.. ఇంకా ఇలాంటి అసత్య ప్రచారాలను చేస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Opeartion Sindhoor
  • PAK PM
  • PAK PM Shahbaz Sharif
  • pm modi
  • Shahbaz Sharif
  • world news

Related News

Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

కేంద్రం నుండి రాష్ట్రానికి అవసరమైన మద్దతు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ లోతుగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ముఖ్యాంశంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు అంశం ప్రస్తావించబడింది.

  • Trump Is Dead

    Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd