World
-
బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!
ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాజీ సెల్యూట్ చేయడాన్ని నిషేధించనున్నారు.
Date : 22-12-2025 - 9:39 IST -
కుప్పకూలుతున్న స్టార్‌లింక్ ..భూమివైపు దూసుకొస్తున్న శాటిలైట్ శకలాలు!
సుమారు 241 కిలోమీటర్ల దూరం నుంచి తీసిన ఈ హై-రిజల్యూషన్ చిత్రాలు అంతరిక్ష పరిశోధకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రాల ఆధారంగా శకలాల కదలిక, వాటి వేగం, దిశ వంటి అంశాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. స్పేస్‌ఎక్స్ అంచనా ప్రకారం, ఈ శకలాలు రాబోయే వారం రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించి ఘర్షణ కారణంగా పూర్తిగా కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Date : 22-12-2025 - 5:15 IST -
బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!
బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ ఈ జెడ్డా టవర్‌ను కూడా రూపొందించారు. సౌదీ అరేబియాలోని వేడి వాతావరణాన్ని తట్టుకునేలా ఇందులో అధునాతన కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నారు.
Date : 21-12-2025 - 8:15 IST -
ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఏవి ? ఎక్కడ ఉన్నాయి ?
ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్లో జపాన్ టాప్లో ఉంది. టోక్యోలోని 'షింజుకు' ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి.
Date : 21-12-2025 - 4:48 IST -
జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!
దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, మూడేళ్ల బాలుడితో సహా 12 మంది మరణించారు.
Date : 21-12-2025 - 11:58 IST -
తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష
. 2021 మే నెలలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్‌ను బహుమతిగా అందజేశారు. పాకిస్థాన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ హోదాలో అందుకున్న విలువైన బహుమతులు తప్పనిసరిగా ‘తోషఖానా’కు అప్పగించాలి.
Date : 21-12-2025 - 5:15 IST -
ట్రంప్ సంచలన నిర్ణయం: గ్రీన్ కార్డ్ లాటరీ ఫ్రోగ్రామ్ నిలిపివేత
బ్రౌన్ మరియు ఎంఐటీ యూనివర్సిటీల్లో జరగిన కాల్పుల కేసులో నిందితుడు లాటరీ వీసా ద్వారా మాత్రమే అమెరికాలో ప్రవేశించాడని తేలడంతో, ఆయన గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశించారు.
Date : 20-12-2025 - 5:15 IST -
చైనా సాయం కోరిన భారత్.. ఏ విషయంలో అంటే?
చైనా ఎంబసీ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణపై చైనా తన ఆలోచనలను భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
Date : 19-12-2025 - 4:55 IST -
జీపీఎస్ ట్రాకింగ్‌తో సముద్ర పక్షి.. చైనా పనేనా?!
గతంలో నవంబర్ 2024లో కూడా కారువార్‌లోని బైత్‌కోల్ ఓడరేవు సమీపంలో ట్రాకింగ్ పరికరం అమర్చిన ఒక ‘వార్ ఈగిల్’ కనిపించింది. అప్పుడు కూడా లోతుగా దర్యాప్తు చేయగా అది వైల్డ్‌లైఫ్ రీసెర్చ్‌కు సంబంధించినదిగానే తేలింది.
Date : 18-12-2025 - 1:58 IST -
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక పరమైన విమాన చలనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Date : 18-12-2025 - 1:17 IST -
11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు.
Date : 17-12-2025 - 6:55 IST -
అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం
వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త ఆంక్షలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. బలహీనమైన వీసా తనిఖీ వ్యవస్థలు, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, ఉగ్రవాద కార్యకలాపాల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 17-12-2025 - 11:55 IST -
ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ కరెన్సీ విశేషాలీవే!
ఒమన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అక్కడి అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు. దీనివల్ల వారి ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉంటుంది.
Date : 17-12-2025 - 10:28 IST -
పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!
ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 17-12-2025 - 8:52 IST -
ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!
టెస్లా, స్పేస్ ఎక్స్ CEO, X (ట్విట్టర్) యజమాని ఎలన్ మస్క్ 2025లో హాట్ టాపిక్‌గా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం నుండి అమెరికా ప్రభుత్వంలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' కి నాయకత్వం వహించడం వరకు ఆయన వార్తల్లో నిలిచారు.
Date : 16-12-2025 - 7:55 IST -
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటన.. అనుమానితుడు హైదరాబాద్ వాసి!
ఈ ఘటన వెనుక తీవ్రవాద కోణం ఉందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లడానికి భారత్‌తో గానీ, లేదా ఇక్కడి స్థానిక సంస్థలతో గానీ ఎటువంటి సంబంధం లేదని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
Date : 16-12-2025 - 6:11 IST -
మెక్సికోలో విమాన ప్రమాదం , 10 మంది మృతి
మెక్సికోలోని టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయల్దేరిన మినీ జెట్ అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Date : 16-12-2025 - 9:20 IST -
LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా?!
భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశంలో LPG ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధరలతో ముడిపడి ఉంటాయి.
Date : 14-12-2025 - 9:55 IST -
President Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!
టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.
Date : 14-12-2025 - 11:21 IST -
Trump Tariffs In India : భారత్ పై టారిఫ్స్.. ట్రంప్ పై పెరుగుతున్న వ్యతిరేకత
Trump Tariffs In India : భారతదేశం నుండి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) ఇప్పుడు ఆయనకు సొంత దేశంలోనే గట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.
Date : 13-12-2025 - 9:10 IST