World
-
crash landing: ల్యాండ్ అవుతుండగా కూలిన విమానం.. వీడియో వైరల్..!
అమెరికాలోని టెక్సాస్‌లో అత్యాధునిక యుద్ధ విమానం ల్యాండ్ (landing) అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఫైటర్ జెట్ F-35B గురువారం టెక్సాస్‌లో ల్యాండ్ (landing) అవుతుండగా ఈ ఘటన జరిగింది.
Date : 16-12-2022 - 9:00 IST -
Thailand Princess: థాయ్‌లాండ్ యువరాణికి గుండెపోటు
థాయ్‌లాండ్ యువరాణి (Thailand Princess) బజ్రకితియాభా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె పరిస్థితి ఒక స్థాయిలో నిలకడగా ఉన్నట్లు సమాచారం. రాయల్ ప్యాలెస్ ఈ సమాచారం ఇచ్చింది. బుధవారం తెల్లవారుజామున స్పృహ కోల్పోయిన యువరాణి (Thailand Princess) బజ్రకితియాభా
Date : 16-12-2022 - 8:25 IST -
World Shortest Man: ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి ఇతనే..!
ప్రపంచంలోని వ్యక్తులంతా ఒకే ఎత్తులో ఉండరు. కొందరు పొడుగ్గా తాడిచెట్టులా ఉంటే.. ఇంకొందరు పొట్టిగా ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి (World Shortest Man)గా ఇరాక్‌కు చెందిన అఫ్షిన్ (Afshin) ఎస్మాయిల్ గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించాడు. అఫ్షిన్ (Afshin) ఎత్తు కేవలం
Date : 16-12-2022 - 7:45 IST -
NRI Boy: గోల్డెన్ గేట్ వంతెన మీది నుంచి దూకి విద్యార్థి సూసైడ్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెనపై నుండి భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ యువకుడు (NRI Boy) సముద్రంలోకి దూకాడు. ఇది అతని మరణానికి కారణమైంది. వంతెనపై మోహరించిన యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రెండు గంటల ప్రయత్నం తర్వాత బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Date : 15-12-2022 - 11:50 IST -
UNSC membership: ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి ఈ దేశాల మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశం శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మద్దతు ఇచ్చాయి. ఐక్యరాజ్యసమితిలో బ్రిటన్ శాశ్వత ప్రతినిధి డామే బార్బరా వుడ్వార్డ్ బుధవారం మాట్లాడుతూ.. UK విదేశాంగ కార్యదర్శి ఈ వారం బహిరంగంగా పునరుద్ఘాటించినందున
Date : 15-12-2022 - 10:34 IST -
Bomb Blast: పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్
పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు (Bomb Blast) కలకలం రేపింది. వజీరిస్థాన్‌లోని దత్తాఖేల్ రోడ్డులో ఈ పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 15-12-2022 - 8:55 IST -
Indian Girl: దుబాయ్‌లో భారతీయ బాలిక మృతి.. తొమ్మిదో అంతస్తు నుంచి జారి
దుబాయ్ (Dubai)లో దారుణం చోటుచేసుకుంది. ఓ భవనంలోని తొమ్మిదో అంతస్తు నుంచి ఐదేళ్ల భారతీయ బాలిక (Indian Girl) ప్రమాదవశాత్తు జారిపడి మరణించింది. ఆడుకుంటూ కిటికీలోంచి జారి పడిందని స్థానికులు తెలిపారు.
Date : 15-12-2022 - 7:29 IST -
Iranian footballer: సంచలన నిర్ణయం.. ఆ దేశ ఆటగాడికి మరణ శిక్ష
ఇరాన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ నసర్ అజాదాని (Amir Nasr-Azadani) అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్ (Iranian footballer)కు మరణ శిక్ష విధించింది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అతడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా అమీర్ (Amir Nasr-Azadani) కొంతకాలంగా ఫుట్ బాల్ మ్యాచులు ఆడటం లేదు.
Date : 14-12-2022 - 10:24 IST -
President Biden: వారికి గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బైడెన్
అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహానికి ఆమోదం లభించింది. అమెరికా పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన గే మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్( President Biden) మంగళవారం సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపునిచ్చే చట్టాన్ని ఆమోదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ (President Biden) మంగళవారం సంతకం చేశారు.
Date : 14-12-2022 - 7:44 IST -
Britan Snow : చలి గుప్పట్లో బ్రిటన్
గతంలో ఎన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను చవిచూస్తోంది యూకే. (Britan Snow) ఈ ఏడాదిలో చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చూసింది. వేలమంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు చలి వంతు వచ్చింది. గడ్డకట్టించే చలి, దుప్పటిలా కప్పేసిన మంచు ప్రభావంతో బ్రిటన్ చిగురుటాకులా వణుకుతోంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 10లకు పడిపోవడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలే
Date : 13-12-2022 - 1:26 IST -
Australia: ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం.. ఆరుగురు మృతి
ఆస్ట్రేలియా (Australia) క్వీన్‌లాండ్ (Queensland)లో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులకు, దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా వారిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Date : 13-12-2022 - 6:42 IST -
Pineapple: అత్యంత ఖరీదైన పైనాపిల్ ఎక్కడో తెలుసా?
విటమిన్ – సి లోపం ఉన్నవాళ్లకు పైనాపిల్ (Pineapple) ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ – సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ఓ పైనాపిల్ (Pineapple) ధర ఎంత ఉంటుంది? రూ.50 లేదా రూ.100. మహా అయితే రూ.150 వరకు ఉండొచ్చు. అయితే, ఇంగ్లాండ్ (England) కార్న్‌వాల్‌లో దొరికే పైనాపిల్ (Pineapple) ధర వి
Date : 11-12-2022 - 10:00 IST -
Bomb Exploded: షాపింగ్ మాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి
కొన్ని రోజులుగా బాంబు పేలుళ్లు (Bomb Exploded) పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ బలూచిస్థాన్‌లోని ఓ షాపింగ్ మాల్లో బాంబు పేలుడు (Bomb Exploded) కలకలం సృష్టిస్తోంది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. దీనికి ఇంకా ఏ గ్రూప్ బాధ్యత తీసుకులేదని తెలిపారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని ఓ షాపింగ్ మాల్లో శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒకరు మృతి
Date : 11-12-2022 - 8:40 IST -
Snake in Plane: ఎయిరిండియా విమానంలో పాము.. ప్రయాణికులలో కలకలం
పాము అనే పేరు చాలా మందికి భయం వేస్తుంది. విమానంలో పాము (Snake in Plane) ఉంటుందని ఎవరూ ఊహించలేరు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో పాము (Snake in Plane) కనిపించడంతో కలకలం రేగింది. శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు దాని కార్గో హోల్డ్‌లో పాము కనిపించింది. ఈ మేరకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ అధికారి ఒకరు సమాచారం అందించారు. దీనిపై ఇప్పుడు విచారణ జరు
Date : 11-12-2022 - 7:20 IST -
Condoms Free: ఫ్రాన్స్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం.. యువతకు కండోమ్స్ ఫ్రీ
2023 జనవరి 1 నుంచి 18-25 ఏళ్ల మధ్య వయసున్న యువకులకు మెడికల్ షాపుల్లో ఉచితంగా కండోమ్(Condoms)లు అందించనున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గురువారం తెలిపారు. తీవ్ర అనారోగ్యం నుంచి యువతను కాపాడేందుకు ఉచితంగా కండోమ్(Condoms)లు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా STD, అవాంఛిత గర్భం నివారించేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకారం.. అవాంఛిత
Date : 10-12-2022 - 8:05 IST -
Russia – America : అమెరికా జైలు నుంచి ‘మృత్యు వ్యాపారి’ బయటకు
అతడి పేరు విక్టర్ బౌట్ (Viktor Bout)..! అతికష్టంపై అమెరికా(America) 2008లో అతడిని అరెస్టు చేసింది.
Date : 09-12-2022 - 2:07 IST -
Green Card: గ్రీన్ కార్డుల జారీలో మార్పులు ఏమిటో తెలుసా ?
దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా విధానాన్ని రద్దు చేసి పుట్టిన దేశం ప్రాతిపదికపై కాకుండా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని
Date : 09-12-2022 - 1:16 IST -
Same Sex Marriage: స్వలింగ పెండ్లిళ్లకు అమెరికా గ్రీన్ సిగ్నల్..!
US సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాల (Same Sex Marriage)కు రక్షణ కల్పించే బిల్లును ఆమోదించింది. బిల్లు చట్టంగా మారేలా సంతకం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి పంపినట్లు ఓ ప్రతినిధి పేర్కొన్నారు. US సెనేట్‌లో ఈ బిల్లు (Same Sex Marriage) ఆమోదం పొందడంతో స్వలింగ వివాహం దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేయబడుతుంది. ఈ బిల్లును ఆమోదించడానికి రిపబ్లికన్ మద్దతు అవసరం. స్వలింగ, వర్ణాంతర వివాహాలు సమాఖ్య చట్టంలో
Date : 09-12-2022 - 8:03 IST -
First female president Dina Boluarte: పెరూ అధ్యక్షపీఠంపై మహిళ.. దేశాధ్యక్షురాలిగా దినా బొలార్టే
పెరూ అధ్యక్షపీఠంపై తొలిసారి ఓ మహిళ ఆసీనురాలయ్యారు. రాజధాని లిమాలో దినా బొలార్టే (Dina Boluarte) అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు ఉన్న అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే (Dina Boluarte) అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబసీకి వెళ్తున్న స
Date : 08-12-2022 - 2:37 IST -
Spain train crash: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ
స్పెయిన్ (Spain train crash)లో రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలోని ఓ రైల్వే స్టేషన్లో ఆగివున్న రైలును మరో ట్రైన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో దాదాపు 155 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. స్పెయిన్‌లో రైలు ప్రమాద (Spain t
Date : 07-12-2022 - 10:45 IST