HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Google Shocked The Employees 12 Thousand Peoples Home

Google: ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. 12వేల మంది ఇంటికి!

మనకు ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం కోసం గూగుల్ ని చూస్తుంటాం. ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడుతున్న సెర్చింజన్ గా గూగుల్ ఉంది

  • Author : Anshu Date : 20-01-2023 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google1a 8
Google1a 8

Google: మనకు ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం కోసం గూగుల్ ని చూస్తుంటాం. ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడుతున్న సెర్చింజన్ గా గూగుల్ ఉంది. ఇక గూగుల్ లో లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గూగుల్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువ అని, అక్కడ ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారని, ఉద్యోగులకు సకల సదుపాయాలు ఉంటాయని మందు నుండి వినిపిస్తున్న మాటలు. అయితే తాజాగా గూగుల్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్బాబెట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ లో పని చేస్తున్న దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీ తెలిపింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా విషయాన్ని చేరవేశాడు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఇ-మెయిల్ లో సుందర్ పిచాయ్ వివరించారు.

గూగుల్ 12వేల మంది ఉద్యోగులను తొలగించగా..రిక్రూటింగ్, కార్పోరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్. ప్రొడక్ట్స్ టీమకు చెందిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు ఉండబోతున్నట్లు గూగుల్ తెలిపింది. ఉద్యోగుల తొలగించు అమెరికాలో వెంటనే ప్రభావంలోకి వస్తుందని, స్థానిక పరిస్థితులను బట్టి వివిధ దేశాల్లో అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.

కాగా ఉద్యోగులను తొలగించిన గూగుల్.. తమ ఉద్యోగులు వేరే ఉద్యోగం చూసుకునేంత వరకు వారికి అండగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన సాయం చేస్తామని పేర్కొంది. అమెరికాలో 60రోజుల పూర్తి నొటిఫికేషన్ కాలానికి జీతం చెల్లించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. అలాగే కాంపన్షేషన్ కింద 16 వారాల జీతంతో పాటు గూగుల్ పని చేసిన ఏడాదికి రెండు వారాల చొప్పున ఇస్తామంది. అయితే అమెరికాలో ఈ నిబంధనలు అమలు చేయనుండగా..వివిధ దేశాల్లో స్థానిక పరిస్థితులను బట్టి కాంపన్షేషన్ ప్రకటిస్తామంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12000 members
  • google
  • Google employees
  • recession

Related News

Google India

భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… 20,000 మందికి ఉద్యోగాలు

Google  భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

    Latest News

    • సీఎం రేవంత్‌కు పదవి గండం..బాంబ్ పేల్చిన సీపీఐ నారాయణ

    • రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అనే హీరోలు వీరేనా ?

    • పబ్ జి ఆడుతూ.. మెదడు నరాలు చిట్లి యువకుడు మృతి

    • ‘తెలంగాణ మీ జాగీరా?’ అంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ MLC దయాకర్ ఫైర్

    • కిరాణాషాపులకు పెను ప్రమాదం పొంచివుందా ?

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd