Hindus: దేశ విభజన సమయంలో ఎంతమంది హిందువులు భారతదేశం నుండి పాకిస్తాన్‌కు వెళ్లారు?
1941 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ ప్రాంతంలోని జనాభాలో 14.6 శాతం హిందువులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు కూడా చాలా తక్కువగా మిగిలాయి.
- By Gopichand Published Date - 08:15 AM, Tue - 29 April 25

Hindus: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంపై చాలా మంది హిందూ-ముస్లిం (Hindus) సమస్యల గురించి గట్టిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసి, వారిని వారి దేశానికి తిరిగి పంపుతున్నారు. భారతదేశం- పాకిస్తాన్ సమస్యల మధ్య విభజన సమయంలో ఎంత మంది హిందువులు భారతదేశం నుండి పాకిస్తాన్‌కు వెళ్లారు? అక్కడ ఎంత మంది మిగిలారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం.
పాకిస్తాన్ జనాభా
స్వాతంత్య్రం సమయంలో భారతదేశంలోని ముస్లిం బహుళ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం. వరల్డ్‌మీటర్ ప్రకారం.. ఇక్కడ సుమారు 23 కోట్లకు పైగా జనాభా నివసిస్తోంది. ఇది ప్రపంచంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన దేశం. 2017 జనాభా లెక్కల ప్రకారం.. ఆ సమయంలో పాకిస్తాన్ జనాభా 20.7 కోట్లుగా ఉండగా, 2023 నాటికి అది 24.14 కోట్లకు చేరింది. 2050 నాటికి పాకిస్తాన్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: Pak Violates Ceasefire: బోర్డర్‌లో మరోసారి టెన్షన్.. పాక్- భారత్ మధ్య కాల్పులు!
పాకిస్తాన్‌లో హిందువులు
పాకిస్తాన్‌లో హిందువుల గురించి మాట్లాడితే.. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారం ముస్లింల తర్వాత అత్యధిక జనాభా హిందువులదే. 2017 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ సుమారు 40 లక్షల హిందువులు ఉన్నారు. పాకిస్తానీ హిందూ పరిషత్ ప్రకారం.. ప్రస్తుతం అక్కడ హిందువుల మొత్తం జనాభా 2.14 శాతం. పాకిస్తాన్‌లోని ఉమెర్‌కోట్ జిల్లా అత్యధిక హిందూ జనాభా కలిగిన ప్రాంతం. ఇక్కడ సుమారు 52% హిందువులు నివసిస్తున్నారు. అలాగే పాకిస్తాన్‌లోని థార్‌పార్కర్ జిల్లాలో సుమారు 7,14,698 మంది హిందువులు నివసిస్తున్నారు.
విభజనకు ముందు పాకిస్తాన్‌లో ఎంత మంది హిందువులు ఉన్నారు?
విభజనకు ముందు గురించి మాట్లాడితే.. 1941 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ ప్రాంతంలోని జనాభాలో 14.6 శాతం హిందువులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు కూడా చాలా తక్కువగా మిగిలాయి. 14 ఆగస్టు 1947న పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయినప్పుడు ఆ తర్వాత 44 లక్షల మంది హిందువులు, సిక్కులు భారతదేశం వైపు వచ్చారు. అదే సమయంలో భారతదేశం నుండి 4.1 కోట్ల మంది ముస్లింలు పాకిస్తాన్‌కు చేరుకున్నారు. 1951 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ పాకిస్తాన్‌లో 1.6% హిందూ జనాభా ఉండగా, తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)లో 22.05% ఉంది. అయితే పాకిస్తాన్ నుండి ఎంత మంది హిందువులు భారతదేశానికి వచ్చారనే దానిపై ఖచ్చితమైన సమాచారం లభ్యం కాలేదు.