Earthquake: టెక్సాస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు
అమెరికాలోని టెక్సాస్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్ చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని చెబుతున్నారు.
- By Gopichand Published Date - 09:40 AM, Sat - 17 December 22

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్ చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. భూకంపంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదు కాగా.. మిడ్‌ల్యాండ్‌కు ఉత్తర వాయువ్యంగా 22 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇది నాలుగో భూకంపమని మిడ్‌ల్యాండ్‌లోని నేషనల్ వెదర్ సర్వీసెస్ కార్యాలయం ట్వీట్ చేసింది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం మిడ్‌లాండ్‌కు వాయువ్యంగా 22 కి.మీ దూరంలో 9 కి.మీ లోతులో ఉంది. అంతకుముందు భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. కొలరాడోలోని యుఎస్‌జిఎస్ నేషనల్ భూకంప సమాచార కేంద్రం అధికారి ఒకరు మాట్లాడుతూ.. 1,500 మందికి పైగా ప్రకంపనలు అనుభవించినట్లు తెలిపారు. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే తక్కువ తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించాయి. నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదని అధికారి తెలిపారు. అంతకుముందు పశ్చిమ టెక్సాస్‌లో కూడా ఇదే స్థాయిలో భూకంపం సంభవించింది. నవంబర్ 16న సంభవించిన భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రం మిడ్‌లాండ్‌కు పశ్చిమాన 95 మైళ్ళు (153 కిమీ) దూరంలో ఉంది.
Also Read: Malaysian Landslide: కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి.. మరికొందరు గల్లంతు