Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి, 36 మందికి గాయాలు
సెంట్రల్ మెక్సికో (Mexico)లో మంగళవారం వెనిజులా వలసదారులతో వెళ్తున్న బస్సు.. కార్గో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు.
- By Gopichand Published Date - 07:15 AM, Wed - 23 August 23

Mexico: సెంట్రల్ మెక్సికో (Mexico)లో మంగళవారం వెనిజులా వలసదారులతో వెళ్తున్న బస్సు.. కార్గో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు సమాచారం అందించారు. వీరిలో ఎక్కువ మంది వెనిజులాకు చెందిన వారని ప్యూబ్లా ప్రభుత్వం తెలిపింది. ఓక్సాకా రాష్ట్రం వైపు దక్షిణం వైపు వెళ్లే హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్గాన్ని వలస స్మగ్లర్లు తరచుగా ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఎందుకంటే స్మగ్లర్లు తరచుగా అసురక్షిత వాహనాలు, డ్రైవర్లను ఉపయోగిస్తారని దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
మెక్సికోలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం సెంట్రల్ మెక్సికోలోని క్యూయాకోపలన్-ఒక్సాకా హైవేపై జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది మరణించారు. మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ లో ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ సెంట్రల్ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు మృతుల సంఖ్య 15గా ఉంది. ఇది కాకుండా తీవ్రంగా గాయపడిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
Also Read: Pakistan Arrest Indians: ఆరుగురు భారతీయులను అరెస్టు చేసిన పాక్.. కారణమిదే..?
బస్సులో వ్యక్తులు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కార్గో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు అధికారులు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. దీంతో పాటు బస్సును అక్కడి నుంచి తొలగించారు.
వాహన ప్రమాదాలు మెక్సికోలో అసాధారణం కాదు. జూలైలో మెక్సికో దక్షిణ గల్ఫ్ కోస్ట్‌లో ఒక వ్యాన్ రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు హోండురాన్ వలసదారులు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. ఫిబ్రవరిలో ప్యూబ్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది వలసదారులు మరణించారు. మెక్సికో ద్వారా US సరిహద్దుకు చేరుకోవడానికి వలసదారులు తరచుగా ట్రక్కులు, బస్సులను ఉపయోగిస్తారు. 2021లో వలసదారులను తీసుకువెళుతున్న ట్రక్కు దక్షిణ నగరమైన టక్స్ట్లా గుటిరెజ్ సమీపంలోని హైవేపై బోల్తా పడి 56 మంది మరణించారు.