JAC : రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస పిలుపు
ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు.
- By Latha Suma Published Date - 06:28 PM, Wed - 12 February 25

JAC : కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు. ఎన్నికల్లో ఆటో డ్రైవర్ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక, వారిని విస్మరించిందని అన్నారు.
Read Also: Anti Sikh Riots : సిక్కుల ఊచకోత కేసు..దోషిగా మాజీ ఎంపీ
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తామన్న ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చామని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి పిలిపించుకుని చర్చించారని, నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలపై సమ్మెకు పిలుపునిస్తే.. ఇంటికి పిలిపించి చర్చించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. బడ్జెట్ సమయంలో ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Minister Sridhar Babu: 93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు