Anti Sikh Riots : సిక్కుల ఊచకోత కేసు..దోషిగా మాజీ ఎంపీ
ఫిబ్రవరి 18న తీర్పును వెలువరించనున్నారు. అదే రోజు శిక్షలను ఖరారు చేయనున్నారు. ఈ కేసులో తీర్పు కోసం సజ్జన్ కుమార్‌ని తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు.
- Author : Latha Suma
Date : 12-02-2025 - 5:02 IST
Published By : Hashtagu Telugu Desk
Anti Sikh Riots : కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ని సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. సిక్కుల ఊచకోత సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల హత్యల కేసులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లుగా కోర్టు చెప్పింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా దోషిగా తేల్చింది. ఫిబ్రవరి 18న తీర్పును వెలువరించనున్నారు. అదే రోజు శిక్షలను ఖరారు చేయనున్నారు. ఈ కేసులో తీర్పు కోసం సజ్జన్ కుమార్‌ని తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు.
Read Also: freebies : ఎన్నికల్లో ఉచిత పథకాలు.. సరైన పద్ధతి కాదు: సుప్రీంకోర్టు
1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
కాగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మారణాయుధాలతో సాయుధులైన ఒక భారీ గుంపు పెద్ద ఎత్తున దోపిడీలు, దహనాలతో పాటు సిక్కుల్ని టార్గెట్ చేశారు. ఈ గుంపు తమ ఇంటిపై దాడి చేసి తన భర్త, కొడుకును చంపినట్లు జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు చేసింది. ఇంట్లో వస్తువుల్ని దోచుకుని వారి ఇంటిని తగులబెట్టినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సజ్జన్ కుమార్‌పై విచారణ జరుపుతూ.. అతను కేవలం అందులో పాల్గొనే వాడు మాత్రమే కాదని, ఆ గుంపుకు నాయకత్వం వహించాడు అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: New Income Tax Bill: రేపు లోక్‌సభ ఎదుటకు నూతన ఐటీ బిల్లు.. దానిలో ఏముంది ?