Trending
-
Heavy rains : హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Date : 02-07-2025 - 2:44 IST -
Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు
రాజ్ నివాస్ మార్గ్‌లోని ఒకటో నంబర్ బంగ్లా ఆమె అధికారిక నివాసంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ పనుల విభాగం (పీడబ్ల్యూడీ) రూ. 60 లక్షలు కేటాయించింది. జూన్ 28న జారీ చేసిన టెండర్ ప్రకారం, ఈ మొత్తం ప్రధానంగా ఎలక్ట్రికల్ ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నారు.
Date : 02-07-2025 - 2:29 IST -
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 02-07-2025 - 2:03 IST -
Pathamailaram : పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సిగాచీ పరిశ్రమ
మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. సిగాచీ కంపెనీ తరఫున సంస్థ కార్యదర్శి వివేక్ కుమార్ ఈ ప్రకటనను బుధవారం విడుదల చేశారు.
Date : 02-07-2025 - 1:30 IST -
GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది.
Date : 02-07-2025 - 1:02 IST -
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
. వారు పసుపు రంగు పొగ వదులుతూ సభలోని సభ్యులను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట నీలమ్ ఆజాద్, అమోల్ శిందేలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
Date : 02-07-2025 - 12:42 IST -
Suriya Jungrungreangkit : థాయ్‌లాండ్‌లో ఒక్క రోజు ప్రధానిగా సూర్య జుంగ్‌రంగ్‌రింగ్‌కిట్
అయితే ఆయన పదవీకాలం కేవలం ఒక్క రోజుకే పరిమితమవడం గమనార్హం. గురువారం జరగనున్న క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కొత్త తాత్కాలిక ప్రధాని నియమితులు కానున్నారు. 38 ఏళ్ల పేతోంగ్తార్న్ షినవత్రాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామాలు వెలుగు చూశాయి.
Date : 02-07-2025 - 12:31 IST -
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్రధానంగా ఉత్తరభారతం మరియు తూర్పు భారతదేశం నుండి వచ్చే విమానాలపై ఈ ప్రభావం కనిపించింది.
Date : 02-07-2025 - 12:17 IST -
Kolkata : లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన..ముగ్గురు నిందితుల కస్టడీ పొడిగింపు
ఈ గాయాలు బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏర్పడ్డవని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో, ప్రధాన నిందితులైన ముగ్గురి పోలీస్ కస్టడీని జులై 8 వరకు పొడిగిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Date : 02-07-2025 - 11:51 IST -
Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్
ఈ మార్పులతో యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులు మరింత వాణిజ్యపరంగా నిర్వహించుకునే అవకాశం పొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం, రద్దీగల సమయాల్లో క్యాబ్ సంస్థలు తాము వసూలు చేసే బేస్ ఛార్జీలపై అదనంగా సర్‌ఛార్జీ వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Date : 02-07-2025 - 11:18 IST -
Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
Date : 02-07-2025 - 11:06 IST -
USA : ఉక్రెయిన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత
ఈ విషయంను పెంటగాన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తమ దేశానికి అవసరమైన ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కీవ్‌కు పంపించాల్సిన కొన్ని కీలకమైన ఆయుధాలు, ఇప్పటికే అమెరికాలో తక్కువ నిల్వలతో ఉన్నట్లు గుర్తించారు.
Date : 02-07-2025 - 10:53 IST -
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ కేసు.. రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
అయితే, ఆయనను విజయవాడ జైలు నుండి సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో మరోసారి తన వ్యాఖ్యలతో చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. విజయవాడ జైలులో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి, సిట్ వ్యవహారాలపై తీవ్రంగా మండిపడ్డారు.
Date : 02-07-2025 - 10:34 IST -
Medaram 2026 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు
2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ తల్లిదేవి గద్దెకు విచ్చేస్తారు. అదే రోజున గోవిందరాజు, పగిడిద్దరాజు లాంటి ఇతర దేవతలు కూడా గద్దెలను అధిష్ఠిస్తారు. 2026 జనవరి 29న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు.
Date : 02-07-2025 - 10:21 IST -
Numerology: ఈ తేదీలలో జన్మించిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలట.. లేకుంటే!
జనవరి, జూన్ లేదా నవంబర్ నెలలలో 1, 4, 6, 7, 11, 22, 24, 25, 29 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తుల మనసు చాలా తీక్షణంగా ఉంటుంది. వీరు పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకుంటారు.
Date : 02-07-2025 - 7:35 IST -
Union Cabinet : పలు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు తమ పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలకు తక్కువ వడ్డీతో లేదా వడ్డీరహిత రుణాలను పొందే వీలుంటుంది. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ రూపంలో నిధుల సౌలభ్యం కల్పించనుంది.
Date : 01-07-2025 - 4:27 IST -
BJP Telangana : రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయి: కిషన్ రెడ్డి
ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫర్వాలేదు. ఐక్యతే మన బలం. అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Date : 01-07-2025 - 4:14 IST -
Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది.
Date : 01-07-2025 - 3:56 IST -
CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక నష్టపోయిన ప్రజలకు మేం భరోసా ఇస్తున్నాం. పేదల కోసం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్క నెలకే పింఛన్ల ఖర్చుగా రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాం.అని వివరించారు.
Date : 01-07-2025 - 3:48 IST -
BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.
Date : 01-07-2025 - 1:58 IST