Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు
- By Sudheer Published Date - 07:54 PM, Mon - 1 September 25

మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు(Harish Rao)పై ఎమ్మెల్సీ కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఆమె స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “హరీష్ నీవల్లే నాన్నపై సీబీఐ ఎంక్వైరీ.. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్‌కు తిండిమీద డబ్బుమీద యావ ఉండదు. కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లలో కొందరి వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది” అంటూ కవిత కంటతడి పెట్టుకున్నారు.
తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారని.. మొదటి సారి అధికారంలోకి రాగానే 6,7 నెలలు తెలంగాణ కు నీళ్లు ఎలా తేవాలో ప్లానింగ్ చేశారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‍కు తిండి మీద డబ్బు మీద యావ ఉండదని.. అలాంటి కేసీఆర్ ను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కంటే కేసీఆర్ ఆస్తిపరుడు కావాలని అనుకున్నాడు అంటున్నారని.. నిజంగానే నిజాం స్ఫూర్తిగానే సాగుతామని ఆమె అన్నారు. కేసీఆర్‌కు అవినీతి మరక ఎవరి వల్ల వచ్చిందో చూడాలన్నారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళు కొందరి వల్ల ఇలా జరిగిందన్నారు. అయినా వారినే మళ్లీ మోస్తున్నారని.. ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగిందంటూ కవిత వ్యాఖ్యానించారు. అందుకే హరీష్ రావును రెండో సారి ఇరిగేషన్ మంత్రి గా తప్పించారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు తన మీద కూడా చాలా కుట్రలు చేశారని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
Peter Navarro: ట్రంప్ సలహాదారు భారత్‌పై కీలక వ్యాఖ్యలు.. ఎవరీ పీటర్ కెంట్?
హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. దేవుని లాంటి కేసీఆర్‌పై సీబీఐ విచారణ అంటే తనకు బాధ కలుగుతుందని.. ఇప్పటి వరకు వాళ్ల పేర్లు చెప్పలేదని.. ఇప్పుడు బాధతో వాళ్ల పేర్లు చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్ మీద సీబీఐ విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.? నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలానే మాట్లాడుతా. ఇది నా తండ్రి పరువుకు సంబంధించింది. కేసీఆర్ పై విచారణ అంటే పార్టీ బంద్‌కు ఎందుకు పిలుపునివ్వలేదు. ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం ఏంటి? రేవంత్.. మీకు దమ్ముంటే.. లోపాయకారీ ఒప్పందం లేకపోతే నేను పేర్లు కూడా చెప్పాను.. వారిపై చర్యలు తీసుకోండి. బీసీల రిజర్వేషన్లపై బిల్లు పెడతారు.. కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎందుకు పోరాడడం లేదు. బీహార్ కోసం తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ బలి చేస్తున్నారు. తెలంగాణ జాగృతి నుంచి బీహార్ వెళ్లి మీ బండారం బయటపెడతాం. సీబీఐ మాత్రమే కాదు.. ఏ ఎంక్వైరీ వేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ” అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.