Trending
-
Char Dham Yatra : చార్‌ధామ్ యాత్ర పునఃప్రారంభం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి కొంత మెరుగుపడింది. అందువల్ల యాత్రపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. అని తెలిపారు. అయితే, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Date : 30-06-2025 - 11:35 IST -
Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించింది. సాంకేతిక సమన్వయం కోసం పూణేలోని భారత వాతావరణ విభాగానికి (IMD) దానిని సమర్పించినట్టు మంత్రి తెలిపారు. జూలై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో, జూలై 4 నుంచి 11 వరకు ప్రయోగానికి విండోగా నిర్ణయించాం అని ఆయన వివరించారు.
Date : 30-06-2025 - 11:22 IST -
Gold Prices: మరోసారి తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే?
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 160 తగ్గి రూ. 97,260కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 150 తగ్గి రూ. 89,150 పలుకుతోంది. కిలో వెండిపై రూ. 100 తగ్గి రూ. 1,17,700గా నమోదైంది.
Date : 30-06-2025 - 11:22 IST -
AP BJP : ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..!
పీవీఎన్ మాధవ్ గతంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆయనకు ఉన్న పార్లమెంటరీ అనుభవం, రాష్ట్ర రాజకీయాలపై బలమైన పట్టు, బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత తదితర అంశాలు పార్టీ అధిష్ఠానం మనసు మార్చేలా చేసినట్టు సమాచారం.
Date : 30-06-2025 - 10:41 IST -
Jeff Bezos: వివాహం తర్వాత పైజామా పార్టీ.. అతిథులకు ప్రత్యేక బహుమతి!
జెఫ్ బెజోస్- లారెన్ సాంచెజ్ వివాహ కార్యక్రమం వెనిస్‌లోని ఇటాలియన్ లగూన్ నగరంలో మూడు రోజుల పాటు జరిగింది. ఇందులో స్వాగత టైట్ డిన్నర్, బహిరంగ వివాహ వేడుక, పైజామా పార్టీ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
Date : 30-06-2025 - 10:39 IST -
Anant Ambani: సంవత్సరానికి అనంత్ అంబానీ సంపాదన ఎంతో తెలుసా?
ఇటీవల కంపెనీ షేర్‌హోల్డర్లకు పంపిన నోటీసులో అనంత్ అంబానీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినట్లు ధృవీకరించారు. దీంతో అతని వార్షిక జీతం 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు.
Date : 30-06-2025 - 7:30 IST -
ODI Match: వన్డే మ్యాచ్‌లో 872 పరుగులు.. 87 ఫోర్లు, 26 సిక్సర్లు!
ఒకే మ్యాచ్‌లో రెండు జట్లు 400 కంటే ఎక్కువ స్కోరు చేశాయి. ఒకవైపు పరుగుల వర్షం కురిసింది. మరోవైపు మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల లెక్క కూడా లేదు. రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం 87 ఫోర్లు, 26 సిక్సర్లు వచ్చాయి.
Date : 30-06-2025 - 6:45 IST -
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కోపం ఎక్కువట..!
ఈ అమ్మాయిలు తమ తప్పును సులభంగా అంగీకరించరు. తాము తప్పు చేశామని తెలిసినప్పటికీ తాము ఎందుకు అలా చేశామని వివరించడానికి పూర్తిగా ప్రయత్నిస్తారు.
Date : 29-06-2025 - 8:00 IST -
Financial Changes In July: జూలై నెలలో ఇన్ని మార్పులు రాబోతున్నాయా?
మీరు రైలులో తత్కాల్ టికెట్ బుక్ చేస్తే ఇప్పుడు ఈ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉంటుంది. జూలై 1 నుండి IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.
Date : 29-06-2025 - 6:45 IST -
Tesla: ప్రపంచంలోనే తొలిసారి.. డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ!
టెస్లా మోడల్ Yని అప్‌డేట్ చేసి ఫుల్లీ ఆటోనమస్ కారుగా తీర్చిదిద్దింది. దీనిని మొదటిసారిగా మార్చి 2019లో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y ధర 40,000 డాలర్లు (సుమారు 34 లక్షల రూపాయలు) నుండి ప్రారంభమవుతుంది.
Date : 28-06-2025 - 11:26 IST -
PJR flyover : వాహనదారులకు ఊరట..పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ఫ్లైఓవర్ సముదాయాన్ని 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు వరుసల (లేన్‌ల)తో, సుమారు 24 మీటర్ల వెడల్పుతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రోజూ ఎదురయ్యే తీవ్ర రద్దీ నుంచి విముక్తి కలిగించేందుకు ఇది కీలకంగా మారనుంది.
Date : 28-06-2025 - 6:44 IST -
Telangana Police : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
ఈ బదిలీల్లో భాగంగా పలువురు అధికారులకు ముఖ్యమైన నియామకాలు చేయడం గమనార్హం. వై. నాగేశ్వరరావును సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా నియమించారు.
Date : 28-06-2025 - 6:23 IST -
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు.
Date : 28-06-2025 - 5:13 IST -
Taliban : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి
పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వేగంగా నడుపుతూ సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. భారీ శబ్దంతో జరిగిన పేలుడుతో సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.
Date : 28-06-2025 - 4:49 IST -
Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక మీడియా సంస్థ కార్యాలయంపై భౌతికంగా దాడిచేయడం అత్యంత నిందనీయం. ఇది కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై కూడా దాడి చేసినట్టే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక స్థంభం అని గుర్తుచేశారు.
Date : 28-06-2025 - 4:33 IST -
Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇప్పటికే రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకూ నోటిఫికేషన్ వెలువడగా, ఇప్పుడు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం కూడా ప్రకటన విడుదల కావడం విశేషం. అభ్యర్థులు జూలై 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-06-2025 - 4:15 IST -
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Date : 28-06-2025 - 3:52 IST -
IndiGo Monsoon Sale: విమాన ప్రయాణీకులకు బంపరాఫర్.. రూ. 1500కే ప్రయాణం, ఆఫర్ ఎప్పటివరకు అంటే?
ఈ ఆఫర్ పీరియడ్ సమయంలో ఎకానమీ క్లాస్ ఒకవైపు టిక్కెట్ ధర ఎంపిక చేసిన దేశీయ రూట్‌లపై కేవలం 1499 రూపాయలు, ఎంపిక చేసిన విదేశీ రూట్‌లపై 4,399 రూపాయలు ఉంటుంది.
Date : 28-06-2025 - 12:20 IST -
Kolkata : లా విద్యార్థినిపై అత్యాచార ఘటన.. సెక్యూరిటీగార్డు అరెస్ట్
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య ఓ ముఖ్య నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Date : 28-06-2025 - 12:18 IST -
Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. తెరపైకి కవిత పీఏ పేరు
సిట్ ఆధికారులు తాజాగా ప్రాథమికంగా సేకరించిన ఆధారాల నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్‌లో నుండి బయటపడిన కొన్ని ఆడియో రికార్డింగులు దర్యాప్తును మరింత ఉత్కంఠతో నింపుతున్నాయి.
Date : 28-06-2025 - 12:06 IST