Trending
-
USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి!
చికాగో నగరంలోని రివర్ నార్త్ పరిసరాల్లోని ఓ రెస్టారెంట్‌లో ఆల్బమ్ విడుదల కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వేడుక సందర్భంగా చాలా మంది యువత అక్కడ లాంజ్‌లో గుమిగూడి ఉన్నారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా లాంజ్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Date : 03-07-2025 - 5:33 IST -
CM Revanth Reddy : హైదరాబాద్‌కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదు.. ప్రపంచ నగరాలతోనే పోటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్‌కి దేశంలో పోల్చదగిన నగరం లేదు. మన నగరం ఇప్పుడు అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోంది. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్-2047 ప్రణాళికను రూపొందించాం.
Date : 03-07-2025 - 5:20 IST -
Supreme Court : ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఒకవేళ వాహనదారుడు తన తప్పిదం వల్లే ప్రమాదానికి గురైతే, బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదు. బాధితుడి కుటుంబ సభ్యులు బీమా పాలసీ షరతులను మరియు అర్హతను కోర్టులో నిరూపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.
Date : 03-07-2025 - 4:55 IST -
Anganwadi : అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి అవకాశాలు సజీవమవుతాయని అంచనా వేయబడుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న హెల్పర్లు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు.
Date : 03-07-2025 - 4:20 IST -
Pashamylaram : పాశమైలారం అగ్నిప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభం
ప్రమాదం జరిగిన తీరును బట్టి పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించబడ్డాయా? కార్మికుల రక్షణకు సరైన చర్యలు తీసుకున్నాయా? అనే అంశాలపై కమిటీ దృష్టి సారించింది. ఈ సంఘటనకు కారణాలు, విఫలమైన భద్రతా ప్రమాణాలు, యాజమాన్యం నిర్లక్ష్యం వంటి అంశాలపై లోతుగా అధ్యయనం జరుపుతోంది. ప్రభుత్వానికి నెల రోజులలో నివేదికను సమర్పించనుంది.
Date : 03-07-2025 - 3:35 IST -
YS Sharmila : కరేడులో భూసేకరణపై షర్మిల ఆగ్రహం..రైతుల పక్షంలో ఉద్ధృత పోరాటం చేపడతాం
భూముల కోసం రైతులను గెంటిపెట్టే విధంగా ప్రవర్తించడం న్యాయసమ్మతమా? అని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరేడు రైతులది సాధారణ పోరాటం కాదు... బతుకుదెరువు కోసం వారు గళమెత్తుతున్నారు.
Date : 03-07-2025 - 3:03 IST -
Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. కవిత లేఖను ఎందుకు, ఎవరి హోదాలో రాసిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఈ లేఖను భారత్ రాష్ట్ర సమితి (భారాస) నాయకురాలిగా రాసారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాసారా? అని ప్రశ్నించారు.
Date : 03-07-2025 - 2:31 IST -
Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు గురువారం విడుదల చేసిన ప్రకటనలో దలైలామా పదవి కేవలం టిబెటన్ ప్రజలకే కాదు, ఆయనను అనుసరించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ప్రాధాన్యత కలిగినది. వారసుడి ఎంపికలో నిర్ణయాధికారం దలైలామాకే ఉంటుంది అని స్పష్టం చేశారు.
Date : 03-07-2025 - 2:22 IST -
Patanjali : ప్రకటనల ప్రచారాన్ని ఆపండి.. పతంజలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
పతంజలి సంస్థ ఇటీవల విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో, ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాము మాత్రమే నిజమైన చ్యవన్‌ప్రాశ్ తయారుచేస్తున్నామనే మాటలు పేర్కొన్నది. అంతేకాదు, ఇతర సంస్థలు సరైన పరిజ్ఞానముండకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని కూడా ఆరోపించింది.
Date : 03-07-2025 - 2:05 IST -
MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
Date : 03-07-2025 - 12:28 IST -
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Date : 03-07-2025 - 12:14 IST -
HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే
HHVM Trailer : ట్రైలర్‌లో పవన్ లుక్, డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి
Date : 03-07-2025 - 11:46 IST -
Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి
ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినిగా ప్రజల కోణంలో పనిచేస్తున్నానని, వారికి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ బీసీల కోణంలో ఉండే నాయకుడిని. ప్రజలు నన్ను నమ్మి దగ్గరకు వస్తున్నారు.
Date : 03-07-2025 - 11:21 IST -
PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం
ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా స్వయంగా ఈ అవార్డును ప్రధానికి ప్రదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..ఈ అవార్డును పొందడం నా జీవితంలో గౌరవకరమైన క్షణం. ఇది భారత్ మరియు ఘనా మధ్య ఉన్న బలమైన సంబంధాలకు సూచిక. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను అంకితంగా స్వీకరిస్తున్నాను.
Date : 03-07-2025 - 11:05 IST -
Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభించగా, గురువారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాసం నుంచి రెండో బృందంగా 5,246 మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయ్‌ల మధ్య కశ్మీర్ లోయకు బయలుదేరారు.
Date : 03-07-2025 - 10:51 IST -
Govindaraja Swamy Temple : తిరుపతిలో అగ్నిప్రమాదం..రెండు దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం
మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు పక్కనే ఉన్న మరో దుకాణానికి వ్యాపించాయి. అంతేకాదు, ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లను కూడా మంటలు చుట్టేశాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో దుకాణాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు పరుగులు పెట్టారు.
Date : 03-07-2025 - 10:33 IST -
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారట!
న్యూమరాలజీ ప్రకారం.. అంకం 1 ఉన్న వ్యక్తులు స్వాతంత్య్రాన్ని ఇష్టపడతారు. ఎవరి కింద పని చేయడం కంటే తమ సొంత మార్గాన్ని తామే సృష్టించుకోవడానికి ఇష్టపడతారు.
Date : 03-07-2025 - 7:30 IST -
GST Revision: సామాన్యులపై మరో పిడుగు.. వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం?
క్లీన్ ఎనర్జీ సెస్ లక్ష్యం ఖరీదైన వాహనాలు, బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధనాలపై పన్నును పెంచడం ద్వారా స్వచ్ఛమైన శక్తి దిశగా అడుగులు వేయడం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిత భారత విధానంతో ముడిపడిన చర్యగా పరిగణించబడుతుంది.
Date : 02-07-2025 - 8:35 IST -
UPI Services: ఈ బ్యాంక్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. రేపు, ఎల్లుండి యూపీఐ సేవలు బంద్!
జులై 3వ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి జులై 4వ తేదీ ఉదయం 11:15 గంటల వరకు మొత్తం 90 నిమిషాల పాటు సేవలు అంతరాయం కలుగుతాయి. అయితే, ఈ సమయం తర్వాత సేవలు మునుపటిలాగే సాధారణ స్థితికి వస్తాయి.
Date : 02-07-2025 - 7:01 IST -
Sheikh Hasina : కోర్టు ధిక్కార కేసు..బంగ్లా మాజీ ప్రధానికి ఆరు నెలల జైలు శిక్ష..!
గతేడాది దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాజకీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలే ఈ పరిణామాలకు దారితీశాయని విశ్లేషకుల అభిప్రాయం. 2024లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక మలుపుల్లో ఒకటి, రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు. అప్పట్లో తీవ్రంగా భగ్గుమన్న ఆందోళనల నేపథ్యంలో హసీనా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
Date : 02-07-2025 - 3:17 IST