BJP : రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం
దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి.
- Author : Latha Suma
Date : 15-07-2024 - 5:03 IST
Published By : Hashtagu Telugu Desk
Rajya Sabha: రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గింది. అలాగే ఎన్డీయే బలం కూడా మెజరిటీ మార్కుకంటే 12 దిగువన ఉంది. రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపీలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది. దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి. దీంతో సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113 కంటే తక్కువగా ఎన్డీయే సంఖ్యాబలం 101గా ఉంది. మెజారిటీకి ఎన్డీయే కూటమికి ఇంకా 12 మంది సభ్యులు అవసరం అవుతారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వద్ద మొత్తం 87 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 26 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు 13 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలకు చెరో 10 మంది చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్డీయే, ఇండియా కూటములలో లేని బీఆర్ఎస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. పలువురు స్వతంత్ర రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీయేతర పార్టీలపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఒడిశాకు చెందిన బిజెడికి 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే ప్రస్తుతం బిజెడి బీజేపీని వ్యతిరేకిస్తోంది. బీజేపీకి మద్దతు ఇవ్వడం లేదు. ఇక మరో పార్టీ అన్నాడిఎంకె కూడా ఎన్డీయేకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేదు.
Read Also: Zomato: రూ.133 తో జాక్ పాట్ కొట్టిన మహిళ, పాపం జొమాటో
మరోవైపు తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే.. వైసీపీకి పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. తెలంగాణ బీఆర్‌ఎస్ నుంచి నలుగురు సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. అయితే బిల్లుల అంశంలో ఈ రెండు పార్టీలు, స్వతంత్ర ఎంపీలు ప్రబుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. మరలా బీజేపీ 12 మంది సభ్యుల్ని నామినేట్ చేసే అవకాశం ఉంది. కనుక వీరు ప్రభుత్వానికి మద్దతిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇకపోతే..ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే బిల్లుల ఆమోదం పొందేందుకు ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ఇతర పార్టీలపై ఎన్డీయే కూటమి ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత దఫా ప్రభుత్వం మాదిరిగా మున్ముందు కూడా బిల్లుల విషయంలో అన్నాడీఎంకే, వైసీపీ పార్టీల మద్దతను ఎన్డీయే పొందాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Read Also: Drug Case : డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు అరెస్ట్..