Telangana: రేవంత్‌పై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
రేవంత్‌రెడ్డిపై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.
- Author : Praveen Aluthuru
Date : 19-10-2023 - 1:37 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: రేవంత్‌రెడ్డిపై నూతన గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. తెలంగాణాలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఇప్పటికే బీజేపీ తీరుపై ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ పై హాట్ కామెంట్స్ చేశారాయన.
ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారు. రెడ్డినైన తనకు గవర్నర్ పదవి వచ్చిందనందుకు రేవంత్ రెడ్డి బాధ పడిపోతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి పని అంటూ ఎద్దేవా చేశారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ బహిరంగంగానే చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తన గవర్నర్ పదవిపై మాట్లాడిన ఇంద్రసేనా రెడ్డి.. మోదీ స్వయంగా ఫోన్ చేసి త్రిపుర గవర్నర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారని.. తన సిన్సియారిటీ గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. మోడీకి ఎవరి పనితీరు ఏంటో బాగా తెలుసని ఆయన చెప్పారు. ఎప్పుడు ఎవరకి ఏ బాధ్యతలు ఇవ్చాలో కేంద్రానికి తెలుసన్నారు. గతంతో పోల్చితే మోదీ హాయాంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.
Also Read: Jaggery: చక్కెరకు బదులుగా బెల్లం వాడితే మంచిదా..?