భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!
భారత్- పాకిస్థాన్ మధ్య వివాదం చాలా పాతది. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో పాకిస్థాన్ కూడా భారత్‌కు రావడానికి సుముఖంగా లేదు.
- Author : Gopichand
Date : 18-02-2026 - 5:28 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI-ICC: భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు దాచలేనివిగా మారాయి. దీని ప్రభావం క్రికెట్ మైదానంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రతి ఐసీసీ టోర్నమెంట్లోనూ ఇరు దేశాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఉద్రిక్తతల కారణంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌ను భారత్ నుండి తరలించాలని ఐసీసీ యోచిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అది బీసీసీఐకి (BCCI) కోలుకోలేని దెబ్బ అవుతుంది.
బీసీసీఐకి కోట్లాది రూపాయల నష్టం
రాబోయే సంవత్సరాల్లో జరగాల్సిన టోర్నమెంట్లను ఐసీసీ భారత్ నుండి వేరే చోటికి తరలిస్తే ఆర్థికంగా బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లుతుంది. కేవలం ఈ ఒక్క నిర్ణయం వల్ల బోర్డు కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ నుండి హోస్టింగ్ హక్కులను ఐసీసీ వెనక్కి తీసుకుంటే ఆ బాధ్యతను ఆస్ట్రేలియాకు అప్పగించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read: ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్సర్.. నిజమేనా?!
ఆసియా దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలు
భారత్- పాకిస్థాన్ మధ్య వివాదం చాలా పాతది. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో పాకిస్థాన్ కూడా భారత్‌కు రావడానికి సుముఖంగా లేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ: టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది.
ఆసియా కప్: ఇరు దేశాల మధ్య ‘నో హ్యాండ్‌షేక్’ (చేతులు కలపకపోవడం) వివాదం పెద్ద దుమారాన్నే రేపింది.
బంగ్లాదేశ్‌తోనూ పెరుగుతున్న దూరం
పాకిస్థాన్‌తోనే కాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్‌తో కూడా వివాదాలు పెరుగుతున్నాయి. మొదట ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ స్పష్టంగా నిరాకరించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరంతర వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ తన ‘బ్యాకప్ ప్లాన్’ గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది.