HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Rtc Special Buses For Sankranthi

తెలంగాణ RTC సంక్రాంతికి స్పెషల్ బస్సులు

  • Author : Vamsi Chowdary Korata Date : 06-01-2026 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
tsrtc special buses sankranti
tsrtc special buses sankranti

TGSRTC  సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5,500 పైగా స్పెషల్ బస్సులు నడపనుంది. జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ కోసం కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, బీహెచ్‌ఈఎల్ ప్రాంతం నుంచి కూడా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆర్సీపురం డిపో నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతోంది.

  • సంక్రాంతి ప్రయాణానికి టెన్షన్ లేదు
  • టీజీఎస్ ఆర్టీసీ 5,500 పైగా స్పెషల్ బస్సులు
  • జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభం!

తెలుగు వారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు.. పండగ పూట సొంతూళ్లలో సంతోషంగా గడపాలని భావిస్తారు. అందుకోసం వ్యయప్రయాసాలకోర్చి సంక్రాంతికి ఊరికి వెళ్లాలనుకుంటారు. అయితే సంక్రాంతి సమయంలో రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ యజమాన్యాల దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగ సమయంలో రద్దీని అదనుగా చేసుకుని ఛార్జీలతో నిలువు దోపిడీ చేస్తారు. ఈ నేపథ్యంలో పండుగకు సొంతూరుకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5,500 పైగా స్పెషల్ బస్సులు నడిపేలా తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని జిల్లాలకు మూడురోజుల్లో 2,500కు పైగా బస్సులు నడపనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 3 వేల వరకు స్పెషల్‌ బస్సులు నడిపేలా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో సంక్రాంతి స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి 9 (శుక్రవారం) నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేలా ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తోంది. కాగా, ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా.. పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీహెచ్‌ఈఎల్‌ నుంచి ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఆర్సీపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఆర్సీపురం నుంచి మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా.. ఏపీలోని అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతోపాటు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్ సుధా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ తేదీల్లోనే..

కాగా, ఆర్సీపురం డిపో నుంచి నడిచే సంక్రాంతి ప్రత్యేక బస్సులు.. జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ సుధా చెప్పారు. ఈ బస్సుల కోసం ముందస్తు ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. అందుకోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని చెప్పారు. ఈ స్పెషల్ బస్సులకు సంబంధించి ఇతర సమాచారం కోసం 9959226149 నెంబరుకు కాల్ చేయాలని వెల్లడించారు. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ సుధా తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Makar Sankranti festival
  • Sankranti Special Buses
  • Special Buses For Sankranthi
  • TGSRTC
  • travellers

Related News

Amaravati

అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Amaravati Velagapudi   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మంటలు చెలరేగటంతో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించ

  • Ap Cm Chandrababu Naidu

    చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Ap Ev Charging Stations

    ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

Latest News

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd