HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Have You Lost Weight Suddenly

Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • Author : Vamsi Chowdary Korata Date : 10-05-2026 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss
Weight Loss

మహేశ్ వయస్సు 40 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు పిల్లలు. తరచుగా కడుపులో ఏదో తెలియని బాధ, అలసటగా ఉండేది. బరువు కూడా చాలా తగ్గాడు. అయినా రోజులో ఎక్కువ సమయం కష్టపడుతూనే ఉంటాడు. దీంతో అధిక శ్రమ వల్లే ఇలా జరుగుతుందనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మలంలో రక్తం కనిపిస్తుండేది. దాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. వైద్యులను సంప్రదించలేదు. కొంత కాలం తర్వాత సమస్యలు తీవ్రమయ్యాయి. భార్య ఒత్తిడితో వైద్యులను సంప్రదించాడు. మహేశ్ కు బౌల్ క్యాన్సర్ అని బయటపడింది. దీంతో తీవ్ర విచారంలో మునిగిపోయాడు.

బౌల్ క్యాన్సర్

దీన్నే కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ అని కూడా అంటుంటారు. పెద్ద పేగులోని కణజాలంలో ప్రాణాంతక క్యాన్సర్ కణాలు చేరుతాయి. ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్ కేసుల్లో ఇది ఒక రకం. కుటుంబ చరిత్ర, అధిక రిస్క్ అడెనోమస్ లేదా పాలిప్స్, అధిక బరువు, పొగ తాగడం, మద్యపానం ఈ సమస్యకు కారణం కావచ్చు.

ప్రముఖ మయోక్లినిక్ నిర్వచనం ప్రకారం… కోలన్ క్యాన్సర్ సాధారణంగా పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంటుంది. మొదట పెద్ద పేగుల్లో పాలిప్స్ మాదిరిగా మొదలవుతుంది. ఆ తర్వాత కొంత కాలానికి క్యాన్సర్ గా మారుతుంది. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇది పాలిప్స్ క్యాన్సర్ గా మారకముందే తీసి వేయించుకుంటే నయం అవుతుంది.

లక్షణాలు…

కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే… కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. మలవిసర్జన ఒకేసారి పూర్తి చేయలేకపోవడం, పలు సార్లు వెళ్లాల్సి రావడం, ప్రేగు కదలికలు అసౌకర్యంగా ఉండటం ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్ సంకేతాలుగా చెప్పువచ్చు. మరీ ముఖ్యంగా మలంలో రక్తం కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయించుకోవాలి. లేదంటే శరీరంలోని ఇతర అవయవాలకు సోకే ప్రమాదం ఉంటుంది. ముందుగా కాలేయానికి, ఆ తర్వాత ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది.

సడెన్ గా బరువు తగ్గడం…

సడెన్ గా బరువు తగ్గుతుంటే అది క్యాన్సర్ అని అనుమానించాలి. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ నిపుణులు తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల్లో 40 శాతం మంది బరువు తగ్గే సమస్యను చూసినట్లుగా చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bowl Cancer
  • health care
  • Health Lifestyle
  • weight loss
  • Weightloss
  • weightloss diet
  • WeightLossTips

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd