HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Government Delivers Another Piece Of Good News To Farmers

రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2026 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Delivers Great News to Workers in Telangana
CM Revanth Delivers Great News to Workers in Telangana

Rythu Bharosa  కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక అదే పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం.. వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది.

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని.. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందినవారు సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఈ 85 వేల మందిలో ఇప్పటికే 62 వేల మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతు భరోసా పథకానికి ఆ రైతులు అర్హత కలిగి ఉన్నారా, వారి భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, 10 రోజుల్లో అర్హులకు సంబంధించిన తుది జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.

రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో సుమారు రూ. 9 వేల కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతీ రైతుకు ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది.

2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్లలో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5.22 లక్షల మందితో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 3.53 లక్షలతో సంగారెడ్డి, ఖమ్మం 3.35 లక్షలు, సిద్ధిపేట జిల్లా 3.18 లక్షలతో ఉన్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Minister Revanth Reddy
  • congress party
  • New Beneficiaries
  • Rythu Bharosa Scheme
  • Rythu Bharosa Scheme Payments
  • telangana farmers
  • telangana government

Related News

Shock for Telangana Ration Cardholders

White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..

తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రా

    Latest News

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

    • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd