Telangana
-
Woman : రేషన్ కార్డు ఉన్న మహిళలకు గొప్ప అవకాశం !
Woman : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని సంస్కృతి విహార్ ప్రాంగణంలో ఈ సంస్థ ద్వారా గ్రామీణ యువతికి నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు దారిగా మారుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ శిక్షణకు అర్హులు
Date : 05-07-2025 - 4:46 IST -
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 05-07-2025 - 3:54 IST -
CM Revanth : కేటీఆర్ సవాల్ కు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్ నేతలు
CM Revanth : ఈ నెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 11 గంటలకు ముఖాముఖీ చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు
Date : 05-07-2025 - 3:35 IST -
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
Date : 05-07-2025 - 1:58 IST -
CM Revanth Reddy : చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Date : 05-07-2025 - 1:22 IST -
KCR : కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, శనివారం ఉదయం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం కేసీఆర్‌కు జ్వరంతో పాటు శరీరంలో బలహీనతలు కనిపించాయి.
Date : 05-07-2025 - 12:24 IST -
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు.
Date : 05-07-2025 - 11:48 IST -
BJP : నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్
పార్టీ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆయన స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బాధ్యతలు స్వీకరించే ముందు, రామచందర్ రావు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉస్మానియా యూనివర్శిటీలోని సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం చార్మినార్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున
Date : 05-07-2025 - 10:52 IST -
Mallikarjun Kharge : ఆపరేషన్ సిందూర్‌కు పూర్తి మద్దతిస్తే..మోడీ యుద్ధాన్ని ఆపారు : మల్లికార్జున ఖర్గే
ఇప్పటివరకు ప్రధాని మోడీ 42 దేశాల్లో పర్యటించారని గుర్తు చేసిన ఖర్గే, అదే సమయంలో మణిపూర్ వంటి తీవ్ర ఉద్రిక్తతలతో కుదురుకుంటున్న రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఆయన సమయం కేటాయించకపోవడం బాధాకరమన్నారు.
Date : 04-07-2025 - 7:17 IST -
KCR Health Condition: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే.. నిన్నటి కంటే భిన్నంగా బీఆర్ఎస్ బాస్!
యశోద ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరిన తర్వాత ఆయనను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
Date : 04-07-2025 - 6:25 IST -
Meenakshi Natarajan : ఇంచార్జ్ మీనాక్షి ని అవమానించిన టీ కాంగ్రెస్ పార్టీ ..?
Meenakshi Natarajan : మంత్రి పొంగులేటి వర్గీయులు మాత్రం ఇది కేవలం ప్రెస్ ప్రకటన డిజైన్‌కు సంబంధించిన అంశమని, ప్రకటనల్లో ఎవరి ఫోటోలు ఉండాలో పబ్లిసిటీ సెల్ చూసుకుంటుందని సమర్థించుకుంటున్నారు
Date : 04-07-2025 - 3:54 IST -
KTR : రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించట్లేదా..? కేటీఆర్ సూటి ప్రశ్న
KTR : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఏడాది కావచ్చినా ఒక్క సరైన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు
Date : 04-07-2025 - 3:14 IST -
KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్‌గా చూస్తున్న సీఎం రేవంత్
మృతుల పట్ల కనీస గౌరవం లేకుండా, వారి శవాలను కార్డ్‌బోర్డు పెట్టెల్లో తరలిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల ఆచూకీ కోసం పోలీసుల కాళ్లపై పడే స్థితికి చేరుకున్నారు. ఇది ఎంత దుర్ఘటన అంటూ కేటీఆర్ స్పందించారు.
Date : 04-07-2025 - 1:52 IST -
Telangana Secretariat : సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నం
Telangana Secretariat : ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని నిరుద్యోగులు ఆరోపించారు
Date : 04-07-2025 - 1:34 IST -
KCR Health : కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఏమన్నాడంటే!
KCR Health : రక్తంలో షుగర్, సోడియం లెవల్స్ వంటి అంశాలపై పరీక్షలు చేయాలని వైద్యులు సూచించగా, అందుకోసం రెండు, మూడు రోజులు దవాఖానలోనే ఉండాలని వారు తెలిపారు
Date : 04-07-2025 - 1:15 IST -
Accident : మహబూబాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
Accident : ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Date : 04-07-2025 - 12:57 IST -
Kavitha : భవిష్యత్‌లో సీఎం అవుతా..బీఆర్ఎస్ నాదే.. కొత్త పార్టీ పెట్టను : ఎమ్మెల్సీ కవిత
ప్రతి ఒక్కరికీ ఎదగాలన్న కోరిక ఉంటుంది. నాకు సైతం ముఖ్యమంత్రిగా మారాలన్న ఆశ ఉంది. అది పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా సాధిస్తా అని ధైర్యంగా పేర్కొన్నారు. ఎంపీగా పని చేసినప్పుడు ఢిల్లీలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయని, నిజామాబాద్ ఎంపీగా ఓడిన తర్వాత కూడా మళ్లీ పోటీ చేయాలనుకున్నానని, అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలిపారు.
Date : 04-07-2025 - 12:38 IST -
Lakdikapul : మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్, ఖర్గే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య అందించిన విశేష సేవలను నేతలు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలోని వినయవంతమైన నడవడి, పాలనాపరమైన అనుభవం, ప్రజల పట్ల చూపిన అవ్యాజమైన ప్రేమను కొనియాడారు.
Date : 04-07-2025 - 11:39 IST -
Kavitha : ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
కేసీఆర్‌కు జ్వరం, మధుమేహ సమస్యలు కనిపించడంతో వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యుల బృందం ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. రిపోర్టుల ప్రకారం కేసీఆర్ రక్తంలో షుగర్ స్థాయులు ఎక్కువగా ఉండగా, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్లు తేలింది.
Date : 04-07-2025 - 10:38 IST -
KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్.. కాస్త టెన్షన్ పడాల్సిన అంశమిదే!
ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద డాక్టర్ ఏంవీ రావు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Date : 03-07-2025 - 11:05 IST