HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Srushti Fertility Scam Doctor Namrata Assets Investigation

Srushti Fertility Scam : సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో కీలక మలుపు

Srushti Fertility Scam : హైదరాబాద్‌ నగరంలో వెలుగులోకి వస్తున్న సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది.

  • Author : Kavya Krishna Date : 11-08-2025 - 5:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srushti Cae
Srushti Cae

Srushti Fertility Scam : హైదరాబాద్‌ నగరంలో వెలుగులోకి వస్తున్న సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. ఈ ఘోర మోసానికి కేంద్ర బిందువుగా ఉన్న డాక్టర్ నమ్రతపై దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్లు, బినామీ ఖాతాలు, ఆస్తులపై పెద్ద ఎత్తున విచారణకు సిద్ధమవుతున్నాయి.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ పేరుతో అక్రమ సరోగసీ, ఐవీఎఫ్ పద్ధతుల్లో శిశువుల అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ కేవలం హైదరాబాద్‌ లేదా రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల వరకు విస్తరించిందని అనుమానాలు ఉన్నాయి.

Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్ పోలీసులు గుర్తించిన వివరాలు నిజంగా షాకింగ్. శిశువులను “చేతులు మారే” ప్రక్రియలో ఒక్కో బిడ్డకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. సెంటర్‌లో డిజిటల్, నగదు రూపాల్లో జరిగిన లావాదేవీలన్నీ రివ్యూ చేస్తున్నారు. డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాలకు సహకరించిన బ్యాంక్ ఖాతాలపై కూడా నిఘా పెట్టారు.

డాక్టర్ నమ్రతతో పాటు సృష్టి పేరుతో నడిచిన బ్యాంక్ అకౌంట్లలో 2019 నుంచి 2025 వరకు భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ సొమ్మును త్వరలోనే ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సరోగసీ పేరుతో మోసపోయిన బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు రాజస్థాన్‌కు చెందిన దంపతులతో పాటు, నల్లగొండకు చెందిన జంట నుంచి రూ.11 లక్షలు, ఓ ఎన్ఆర్ఐ నుంచి రూ.19 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.16 లక్షలు, మరో జంట నుంచి రూ.12.5 లక్షలు డాక్టర్ నమ్రత వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు ధృవీకరించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై కచ్చితమైన ఆధారాలు సేకరిస్తోంది. అక్రమ సరోగసీ గ్యాంగ్‌ నెట్‌వర్క్ మొత్తం కూలగొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన వివరాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Doctor Namrata
  • hyderabad crime
  • IVF Scam
  • Srushti Fertility Scam
  • Surrogacy Fraud

Related News

Girl Harassment

వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Kakinada Girl  సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి,

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd