Rain Alert: అల్పపీడనం ఆవాహనం.. తెలంగాణలో వానలే వానలు
Rain Alert: తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా, చాలాసార్లు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- By Kavya Krishna Published Date - 10:31 AM, Tue - 12 August 25

Rain Alert: తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా, చాలాసార్లు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని అధికారులు సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన కూడా జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ మంగళవారం తెల్లవారుజాము నుండే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ఓయూ, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, హకీంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టౌలీచౌకి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వాన వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్యలు చోటు చేసుకున్నాయి.
BC Reservations : BC రిజర్వేషన్ల సాధనకు త్వరలో కార్యాచరణ – కవిత
ఇక ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాల అవకాశాలు ఉన్నాయి. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. అక్కడ 40 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో గాలులు వీస్తాయని, తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. విరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య వేగంతో గాలులు వీస్తున్నాయని Hyderabad Weather Department తెలిపింది.
Brahma Muhurtam : బ్రహ్మముహూర్తంలో లేచే వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే?