HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Naveen Yadav Win In Jubliee Hills By Poll

Jubliee Hills: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం!

ఈ చారిత్రక విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక పర్యవేక్షణ ప్రధాన పాత్ర పోషించింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకు ఆయన ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.

  • Author : Gopichand Date : 14-11-2025 - 2:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jubliee Hills
Jubliee Hills

Jubliee Hills: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ (Jubliee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించారు. తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 25 వేల ఓట్లకుపైగా భారీ మెజార్టీతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం చరిత్రలో ఇంతటి మెజార్టీ సాధించడం ఇదే ప్రథమం కావడం విశేషం.

స్పష్టమైన ఆధిక్యం, పరాజయం లేని పయనం

ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన తొలి రౌండ్‌ నుంచే నవీన్‌ యాదవ్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ప్రతి రౌండ్‌ పూర్తయ్యేసరికి ఆయన మెజార్టీ మరింత పెరుగుతూ పోయింది. BRS అభ్యర్థి మాగంటి సునీత ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఇది BRSకు గట్టి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. భారత రాష్ట్ర సమితి, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా గల్లంతైంది.

Also Read: Jubilee Hills Byelection Counting : 20 వేలు దాటిన కాంగ్రెస్ మెజార్టీ

సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహమే విజయం రహస్యం

ఈ చారిత్రక విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక పర్యవేక్షణ ప్రధాన పాత్ర పోషించింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకు ఆయన ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. విజయాన్ని సులభతరం చేసేందుకు, పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కట్టబెట్టడం మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పట్టును మరింత పెంచడానికి దోహదపడింది. అంతేకాక డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సీఎం తీసుకున్న చర్యలు కూడా విజయాన్ని ప్రభావితం చేశాయి.

ఓటములను మెట్లుగా చేసుకున్న నవీన్‌ యాదవ్

నవీన్‌ యాదవ్‌ రాజకీయ ప్రస్థానం ఓటములతో కూడిన అనుభవాల నుంచి వచ్చింది. 2009లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా MIM నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో MIM తరఫున జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు (25.19%) సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో రహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు.

సుదీర్ఘ కాలం పాటు ఓటములను ఎదుర్కొన్న నవీన్‌ యాదవ్‌.. చివరకు 2023 నవంబరు 15న నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి, ఇప్పుడు అదే పార్టీ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. ఈ గెలుపు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అధికారికంగా ఈసీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • hyderabad news
  • Jubliee Hills
  • Jubliee Hills By Poll
  • Naveen Yadav
  • telangana news

Related News

Brs Grama

పదేళ్లలో బిఆర్ఎస్ నేతల కబ్జాలు అన్ని ఇన్ని కావు !!

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, వారి హయాంలో నాయకులు మరియు దళారులు కలిసి విలువైన సరస్సుల భూములను, ఎఫ్టీఎల్ (FTL) మరియు బఫర్ జోన్లను యథేచ్ఛగా కబ్జా చేశారు

  • Kcr Ktr

    కేసీఆర్ ఉద్దేశ్యం అదేనా ? మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో ఉండాల్సిందేనా ?

  • Uttam Krishna Water

    పదేళ్లలో బిఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలంటూ మంత్రి ఉత్తమ్ డిమాండ్

  • Sankranthi Toll Gate

    టోల్ మినహాయింపు లేఖ పై కాంగ్రెస్ పై బిఆర్ఎస్ విమర్శలు

  • Brs Grama

    బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

Latest News

  • గృహ జ్యోతి ద్వారా 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది – భట్టి

  • కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్

  • ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌, ప్రజల పై విద్యుత్తు భారాన్ని తగ్గించిన ఏపీ ప్రభుత్వం

  • రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!

  • రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్

Trending News

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd