HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Luring Congress Mlas To Bring Down Govt After Lok Sabha Elections

Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-01-2024 - 8:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Telangana

Telangana: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నెల రోజులు ముగిసిన నేపథ్యంలో తన పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా రానున్న లోకసభ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టారు సీఎం రేవంత్. అయితే లోకసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ నేత బండి సంజయ్.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ భారీ ఎత్తున నిధులు ఇచ్చి కోవర్టులుగా మార్చుకున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చంటూ బాంబు పేల్చారు బండి. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ నేతలు ఓ కన్నేసి ఉంచండి.. అభివృద్ది జరగాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్న బీజేపీ గెలవాలని బండి సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సంజయ్..యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదనీ బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకుని ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని బండి సంజయ్‌ సూచించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు వస్తుడడంతో భారీగా సన్నాహాలు చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తరువాత కేసీఆర్ మొదటి సరిగా గజ్వేల్ లో పర్యటించనున్నట్లు సమాచారం.

Also Read: Dream: మీకు కలలో పాము కనిపించిందా.. అయితే జరగబోయేది ఇదే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • bring down
  • brs
  • congress
  • governament
  • kcr
  • Lok Sabha Elections
  • MLAs
  • telangana

Related News

Bail period ends... Bandi Bhagirath returns to Cherlapally Jail.

Bandi Bhageerath: ముగిసిన బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన్ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్థరాత్రి వేళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గతంలో నమోదైన ఈ తీవ్రమైన న

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd