HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Farmers Rythu Bharosa Funds To Be Released Today

Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 30-06-2026 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for farmers... Rythu Bharosa funds to be released today.
Good news for farmers... Rythu Bharosa funds to be released today.

తెలంగాణలోని లక్షల మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం నేడు తొలి విడత నిధులను విడుదల చేయనుంది. మొదటి విడత కింద రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 2,482.02 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్‌ట్యాప్‌లో బటన్ నొక్కి ఈ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ భారీ రైతు ఆశీర్వాద సభను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ సభ నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తక్షణమే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు.

రాష్ట్రంలోని మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాల సాగుభూమికి గానూ, ఎకరానికి రూ. ఆరు వేల చొప్పున మొత్తం రూ. 9 వేల కోట్లను దశలవారీగా విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. అందులో భాగంగానే ప్రాధాన్యత క్రమంలో మొదటగా తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు తొలి విడత సాయం అందుతుందన్నారు. రైతు భరోసా నిధుల బదిలీ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముంబయిలోని ఆర్బీఐ కార్యాలయానికి, హైదరాబాద్‌లోని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి, అలాగే అన్ని వాణిజ్య, గ్రామీణ బ్యాంకులకు ముందస్తు సమాచారం అందించింది. రైతుల ఖాతాల్లో జమ అయ్యే ఈ సాయాన్ని బ్యాంకులు వారి పాత రుణ బకాయిల కింద మినహాయించుకోవడానికి వీల్లేదని, ఈ నిధులు పూర్తిగా రైతుల సాగు అవసరాలకే దక్కేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 2500 మంది రైతులు హాజరుకానున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు తమ పరిధిలోని రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారంలో భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. కొత్తగా పట్టాదార్ పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. అలాంటి వారు జులై 5వ తేదీ లోపు తమ సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి, తమ భూమి వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే వారు కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయం పొందేందుకు అర్హులవుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress party
  • rythu bharosa
  • Rythu Bharosa amount
  • Rythu Bharosa Scheme
  • telangana government

Related News

Huge good news from the Revanth government for Telangana employees.

CM Revanth Reddy: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల, పింఛన్‌దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో రెండు వేల కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల మే 29న మొదటి విడతగా రెండు వేల కోట్లు విడు

  • Massive transfer of DSPs in Telangana

    DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Huge good news from the Revanth government for Telangana employees.

    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.

    Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు.. ఉత్తర్వులు జారీ

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Latest News

  • Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

  • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం

  • Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

  • Pawan Kalyan Injury: పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్

  • Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd