HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rains For The Coming Week

Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 30-06-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains for the coming week
Heavy rains for the coming week

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక బుధవారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం భరంపూర్‌లో 9 సెం.మీ భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్యాలలో 8.6 సెం.మీ, నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో 8.4 సెం.మీ వర్షపాతం రికార్డయింది. నల్గొండ జిల్లా దామరచర్లలో 8.3 సెం.మీ, చింతపల్లి మండలం గొడ్కొండ్లలో 8 సెం.మీ, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో 7.9 సెం.మీ చొప్పున వానలు పడ్డాయి. అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లా సిరికొండలో 7.8 సెం.మీ, మోస్రాలో 7.8 సెం.మీ, జనగామ జిల్లా తాటికొండలో 7.7 సెం.మీ వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిజాంబాద్‌లో 7.3 సెం.మీ, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాండ్ల సంకీసలో 7.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. వీటితో పాటు ములుగు, కామారెడ్డి, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో 6.4 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

సాధారణంగా జూన్ మొదటి వారంలోనే తెలంగాణను పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా రుతుపవనాల గమనం నెమ్మదించడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనివల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జూన్ నెలలో కూడా ఎండలు దంచికొట్టాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించాయి. వాతావరణం అనుకూలించడంతో ఇకనైనా వానలు సకాలంలో పడి పంటల సాగు సవ్యంగా సాగుతాయని తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలు ఖరీఫ్ సాగు పనులకు ఎంతగానో దోహదపడతాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IMD Weather Update
  • rainfall forecast
  • southwest monsoon
  • Telangana Weather Update
  • telangana Weather Updates
  • Today Weather Update
  • TS weather update
  • Weather Forecast
  • Weather Forecast Today
  • Weather Update
  • Weather Update Today
  • weather updates

Related News

Heavy rain forecast for Telangana.

Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి చాలా రోజులు అవుతున్నా ఆ స్థాయిలో మాత్రం వర్షాలు పడటం లేదు. ఫలితంగా ఎండ, ఉక్కపోత, వేడి అలాగే ఉన్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తుండటంతో వర్షాలు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ క

  • Heavy rains in Telangana... fresh warning for these districts.

    Telangana Weather Updates: తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..

Latest News

  • Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

  • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం

  • Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

  • Pawan Kalyan Injury: పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్

  • Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd