HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sanjay Jaju Appointed As New Chief Secretary Of Telangana Orders Issued

Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు.. ఉత్తర్వులు జారీ

  • Author : Vamsi Chowdary Korata Date : 26-06-2026 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.
Sanjay Jaju appointed as new Chief Secretary of Telangana; orders issued.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండగా, ఆ తర్వాత సంజయ్ జాజు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రేసులో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సంజయ్ జాజు వైపే మొగ్గింది. తెలంగాణ కేడర్‌కు చెందిన సంజయ్ జాజు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మీ సేవతోపాటు పలు కీలక ఐటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సంజయ్ జాజు చివరగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు.

తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తితో, ఇటీవల మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి సంజయ్ జాజును రిలీవ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు కేటాయిస్తూ, కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) డైరెక్టర్ అన్నీస్ కన్మణి జాయ్ ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేశారు.

సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తన పనులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ జిల్లా సబ్‌ కలెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా కూడా సంజయ్ జాజు సేవలు అందించారు. మీ సేవ, మున్సిపల్ సేవల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చే ఐటీ ప్రాజెక్టులను సంజయ్ జాజు ప్రవేశపెట్టారు.

తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత 2014 అక్టోబర్‌లో డిప్యుటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లిన సంజయ్ జాజు, గత 12 ఏళ్లలో కేంద్రంలోని అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు NHIDCLకు డైరెక్టర్‌గా పనిచేసిన సంజయ్ జాజు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, హిమాలయ సరిహద్దుల్లో వ్యూహాత్మక నేషనల్ హైవేలు, కఠినమైన టన్నెల్స్ నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టారు. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు రక్షణ మంత్రిత్వ శాఖలో రక్షణ ఉత్పాదక శాఖ అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ రంగంలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CS Telangana
  • Sanjay Jaju
  • Telangana Chief Secretary
  • telangana government

Related News

New pensions... Minister Seethakka shares good news for single women.

Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

తెలంగాణలోని అర్హులైన ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి నూతనంగా అర్హత పొందిన ఒంటరి మహిళలందరికీ కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. ఒంటరి మహిళల పెన్షన్ల పంపిణీలో ఎల

  • Telangana government's key decision... fantastic news for Gram Panchayats...

    Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు అదిరిపోయే శుభవార్త..

  • A flurry of appointments in the Congress... Ministerial berths confirmed for those two... Here are the contenders in the race.

    Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే

  • Supreme Court rejects Telangana's plea regarding the Banakacherla petition.

    Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd