Gold Price Today : రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట దక్కుతోంది. ఇటీవల భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు స్వల్పంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు రేట్లు పడిపోయాయి. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజు తగ్గినప్పటికీ.. ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. ఇప్పుడు ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 09:38 AM, Wed - 29 January 25

Gold Price Today : మన దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు జరిగితే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారమే. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దీని ప్రాముఖ్యత ఎనలేనిది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసి ధరించడంలో ఆసక్తి చూపుతారు. బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా, పెట్టుబడిగా కూడా విశేష ప్రాధాన్యం కలిగిఉంది. అంతే కాకుండా, వెండి కూడా విస్తృతంగా వినియోగించబడుతుంది. అయితే, ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గత రోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2,740 డాలర్లకు తగ్గినప్పటికీ, తిరిగి 2,760 డాలర్ల స్థాయికి చేరుకుంది. వెండికి సంబంధించి, స్పాట్ సిల్వర్ రేటు ప్రస్తుతం 30.43 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు, రూపాయి విలువ మరింత దిగజారింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.60 వద్ద ఉంది.
Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!
దేశీయంగా బంగారం, వెండి ధరలు
భారతదేశంలో గోల్డ్ రేట్లు నగరానుగణం మారుతూ ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి, తులం రూ. 75,100కి చేరుకుంది. గత రోజు రూ. 150 తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 81,930కి చేరింది. విజయవాడలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో హైదరాబాద్ కంటే బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థానిక పన్ను రేట్లు, ఇతర అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం తులం రూ. 75,250గా ఉంది, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 82,080గా నమోదైంది. వెండి రేట్ల విషయానికి వస్తే, ఢిల్లీలో ప్రస్తుతం కేజీ రూ. 96,500 వద్ద ఉంది. గత రోజు వెండి ధర రూ. 1,000 తగ్గింది. మరోవైపు, హైదరాబాద్‌లో వెండి ధర కేజీకి రూ. 1.04 లక్షలుగా కొనసాగుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండవు. స్థానిక టాక్స్‌లు, డిమాండ్ & సప్లై ఆధారంగా ధరలు మారుతాయి. కావున, గోల్డ్ & సిల్వర్ కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్‌లో తాజా రేట్లను పరిశీలించాలి.
Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి కీలక చర్యలు – భట్టి విక్రమార్క