Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!
Maha Kumbh Mela 2025 : జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
- By Kavya Krishna Published Date - 06:43 PM, Tue - 28 January 25

Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళ నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఇక మహాకుంభమేళ ప్రారంభమైన 17 రోజుల్లోనే 15 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌లో పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా రైల్వే శాఖ , ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాయి. జనవరి 13, 14 తేదీల్లో కూడా భారీగా భక్తులు కుంభమేళలో పాల్గొన్నట్లు సమాచారం.
World Expensive Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. 250 గ్రాములకు 7500 రూపాయలు..!
రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
రైల్వే శాఖ మొత్తం 60 ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు, భక్తుల రద్దీని అనుసరించి మరో 190 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచింది. అలాగే, ఈ మార్గంలో 110 సాధారణ రైళ్లు యధావిధిగా నడుస్తాయని వెల్లడించింది. ప్రయాగ్ రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. భద్రత కోసం 10 వేల మంది రైల్వే రిపబ్లికన్ ఫోర్స్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
భద్రతా చర్యలు
మౌని అమావాస్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్రివేణి సంగమ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను అమర్చింది. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం ఆచరించినట్లు గణాంకాలు వెల్లడించాయి.
మౌని అమావాస్య ప్రత్యేకత
హిందూ క్యాలెండర్ ప్రకారం, మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా శారీరక, ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయని నమ్మకం. అఖాడాలు, సాధువులు, సన్యాసులు ప్రత్యేక ఊరేగింపుగా వచ్చి అమృత స్నానం ఆచరిస్తారు. మౌని అమావాస్యను సాధువుల అమావాస్యగా కూడా పిలుస్తారు.
ఈ పవిత్ర రోజున స్నానం చేస్తూ మౌనంగా ఉండడం సంప్రదాయం. నదుల నీరు అమృతంగా మారుతుందనే నమ్మకం భక్తులను ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో, యోగి ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించి కార్యక్రమాన్ని మరింత విశిష్టతతో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Cold Water : మీ జీర్ణవ్యవస్థకు చల్లని నీరు ఎందుకు మంచిది కాదు..!