HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tdp Mp Putta Mahesh Kumar Yadav Arrested In Moinabad

డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై కుట్ర జ‌రుగుతుందా?!

ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్‌కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.

  • Author : Gopi Date : 15-03-2026 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MP Putta Mahesh Kumar
MP Putta Mahesh Kumar

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో తెలంగాణ ఈగల్ టీమ్ దాడులు, అరెస్టుల కంటే.. జరుగుతున్న ప్రచారంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏలూరు ఎంపీ, యువ నేత పుట్టా మహేష్ యాదవ్‌ను ఈ కేసులోకి లాగడం వెనుక ఒక వ్యవస్థీకృత రాజకీయ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

టెస్టుల ఫలితాల్లో గందరగోళం.. మతలబు ఎక్కడ?

ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్‌కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు ‘నెగెటివ్’ అని తేలింది. కానీ, కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ పరీక్షలు నిర్వహించి ‘పాజిటివ్’ వచ్చిందని ప్రకటించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే వ్యక్తికి గంటల వ్యవధిలో ఫలితాలు మారడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? నివేదికలను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: సంతోషం అనేది కేవలం మనసుకి సంబంధించిన విషయమే కాదంట‌!

ఎదిగే బీసీ నేతపైనే కక్షా?

పుట్టా మహేష్ యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నాయకుడు. తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులతో ఆయన దూసుకుపోతున్నారు. అనతి కాలంలోనే ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ, పార్టీలో ఆయన ప్రాధాన్యత పెరగడాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలాంటి కేసుల సాకుతో ఒక బీసీ నేత రాజకీయ భవిష్యత్తును చిదిమేయాలని చూస్తున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు నిందితులను వదిలేసి.. మహేష్‌పైనే ఫోకసా?

ఈ ఫామ్‌హౌస్ ఘటనలో అనేక తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పీఏ తన ఫోన్‌ను పగలగొట్టి ఆధారాలు ధ్వంసం చేయడంపై దర్యాప్తు ఎటు సాగుతోంది? గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రోహిత్ రెడ్డి వంటి వారి పేర్లను పక్కన పెట్టి, కేవలం మహేష్ యాదవ్‌ను మాత్రమే వైసీపీ నేతలు టార్గెట్ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నిందితుల విషయంలో మౌనంగా ఉంటూ, కేవలం ఒక బీసీ ఎంపీని బ్లేమ్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రత్యర్థులు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

విచారణ తేలకముందే సోషల్ మీడియా దాడి

ఏదైనా కేసులో విచారణ పూర్తికాకుండా కోర్టు తీర్పు వెలువడకుండా ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. మహేష్ యాదవ్ తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ, పనిగట్టుకుని ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హీనమైన చర్యగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drugs case
  • hyderabad
  • Moinabad
  • MP Putta Mahesh Kumar
  • political news
  • TDP MP

Related News

Preethi Reddy

Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

మల్లారెడ్డి కుటుంబం గత కొంతకాలంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీతి రెడ్డి వరుసగా బీజేపీ అగ్రనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమె మాత్రం తన పర్యటనలను కేవలం

  • Rtc Workers Protest

    RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

  • ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

    ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Latest News

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

  • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

  • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

  • Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd