Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్‌ఎస్‌కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
- By Praveen Aluthuru Published Date - 04:46 PM, Sat - 22 June 24
 
                        Errabelli Dayakar Rao: వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ బలాన్ని తగ్గించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎర్రబెల్లి సాయంతో మరికొంత మంది ముఖ్య నేతలను ఆకర్షిస్తారని, తద్వారా బీఆర్‌ఎస్ బలహీనపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవలి ఎన్నికల్లో తన కూతురు కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించడంలో విజయం సాధించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్‌ఎస్‌కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
పార్టీ ఫిరాయింపుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఎర్రబెల్లి.. నేను పార్టీ మారడం లేదని, ఆ ఆలోచన కూడా నాకు లేదని చేప్పారు. కాగా ఎన్నికల ఫలితాలు బాధ కలిగించాయని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలుగుదేశం వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి రెండో దఫా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2023 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జరిగిన తొలి ఓటమిని రుచి చూశారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభలో బీఆర్ఎస్ తన గుర్తింపును కోల్పోయినప్పటి నుండి ఎర్రబెల్లి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎర్రబెల్లి వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినప్పటికీ, ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌లోని ఒక వర్గం నేతలు ఎర్రబెల్లితో చర్చలు జరుపుతున్నప్పటికీ, ఎర్రబెల్లి అదేం లేదని కొట్టిపారేస్తున్నారు.
Also Read: T20 World Cup: కీలక మ్యాచ్ కోసం సంజూని దింపుతున్న రోహిత్