8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?
జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది.
- Author : Gopichand
Date : 11-01-2026 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
8th Pay Commission: 2016లో అమలులోకి వచ్చిన 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్‌తో ముగుస్తుంది. 10 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో జనవరి 2026 నుండి కొత్త జీతాలు అమలవుతాయని ఉద్యోగులు ఆశించారు. అయితే ప్రభుత్వం తాజా అప్‌డేట్ ఇచ్చింది. వేతన సంఘం తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించి, వాటికి ఆమోదం లభించే వరకు కొత్త వేతన స్కేలు అమలు చేయడం సాధ్యం కాదు. కొత్త వేతనం ఆలస్యంగా అమలైనప్పటికీ బకాయిలు మాత్రం జనవరి 1, 2026 నుండి లెక్కించబడతాయి.
జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?
8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులు ఇంకా సిద్ధం కాలేదు. నివేదిక సమర్పించి, ఆమోదం పొందిన తర్వాతే కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి. అందుకే జనవరి 1, 2026 నుండి ఆటోమేటిక్ గా జీతాల పెరుగుదల జరగలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని అమలు చేస్తారు. కానీ సిఫార్సులు అందే వరకు ప్రస్తుత విధానమే కొనసాగుతుంది.
8వ వేతన సంఘం ఆలస్యానికి గల కారణాలు
జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. 10 ఏళ్ల విరామాన్ని తొలగించి, ప్రతి ఏటా జీతాలు పెంచేలా ప్రభుత్వం ఏదైనా కొత్త ఫార్ములాను తీసుకురావచ్చనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ‘పనితీరు ఆధారిత’ ఇంక్రిమెంట్లపై దృష్టి సారించే అవకాశం ఉంది. కొత్త వేతన సంఘం అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతుంది. దీనిపై సమీక్ష కొనసాగుతోంది.
Also Read: సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?
జీతం ఎంత పెరగవచ్చు?
ఒకవేళ 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉండవచ్చు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor): దీనిని 2.57 నుండి 3.68కి పెంచే అవకాశం ఉంది.
కనీస వేతనం (Basic Salary): ఇది రూ. 18,000 నుండి రూ. 26,000 వరకు పెరగవచ్చు.
పెన్షన్: పెన్షనర్ల పెన్షన్ కూడా సుమారు 25-30% పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్థికవేత్త ప్రొఫెసర్ రజనీష్ క్లార్ అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం కనీస వేతనాన్ని నెలకు రూ. 40,000 నుండి 50,000 వరకు పెంచే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికి రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. అయితే డేటా సేకరణ, వివిధ విభాగాలతో చర్చలు, ఆర్థిక ప్రభావ అంచనా వంటి పనుల వల్ల ఈ ప్రక్రియకు సమయం పడుతుంది. ఈ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిందే. జీతాల పెరుగుదల ఆలస్యమైనప్పటికీ ఉద్యోగులకు నష్టం ఉండదు. ఎందుకంటే జనవరి 2026 నుండి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ సిఫార్సులు 2026-27 సమయంలో అమలు కావచ్చని భావిస్తున్నారు.