HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >New Year Same Virat Kohli Indian Great Reaches New Milestone

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన తర్వాత కూడా కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశారు.

  • Author : Gopi Date : 11-01-2026 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

Virat Kohli: విరాట్ కోహ్లీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే 28 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆయన తాజాగా న్యూజిలాండ్‌తో వడోదరలో జరుగుతున్న మొదటి వన్డేలో మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో 42 పరుగులు పూర్తి చేయగానే శ్రీలంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కరను వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు.

ప్రపంచ రికార్డు వివరాలు

కుమార సంగక్కర తన 666 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్‌లో 28,016 పరుగులు చేశారు. ఇన్నాళ్లూ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఆయన పేరిట ఉన్న రికార్డును కోహ్లీ ఈరోజు తుడిచిపెట్టారు.

నెంబర్ 1: సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు).

నెంబర్ 2: విరాట్ కోహ్లీ (కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే సంగక్కరను దాటేశారు). విశేషమేమిటంటే సచిన్, సంగక్కర కంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు టాప్-2 స్థానాల్లో భారత క్రికెట్ దిగ్గజాలే ఉండటం గమనార్హం.

Also Read: మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

THE GREATEST EVER – KING KOHLI 😍 pic.twitter.com/hM5t24r5Tb

— Johns. (@CricCrazyJohns) January 11, 2026

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన తర్వాత కూడా కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశారు. విరాట్ కోహ్లీకి ఇది వరుసగా ఐదవ సారి 50+ స్కోరు కావడం విశేషం. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 94 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేయడంతో టీమ్ ఇండియాకు ఈ లక్ష్య ఛేదన సులభంగా మారుతోంది. ప్ర‌స్తుతం క్రీజులో అయ్య‌ర్, విరాట్ కోహ్లీ ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు

  • సచిన్ టెండూల్కర్- 34,357
  • విరాట్ కోహ్లీ- 28,017*
  • కుమార సంగక్కర- 28,016
  • రికీ పాంటింగ్- 27,483
  • మహేల జయవర్ధనే- 25,957


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ind vs NZ
  • Kumar Sangakkara
  • sachin tendulkar
  • sports news
  • virat kohli

Related News

India's first ODI against England today... 'Ro-Ko' mania begins again.

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్

టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత.. వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో పోటీకి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్ల రాకతో భారత్ పటిష్టంగా మారింది. అయితే ఇటీవల టీ20 సిరీస్ ఓటమి జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌కు ఉన్

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd