రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదే: మాజీ క్రికెటర్
కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 202 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సెంచరీ సాధించారు.
- Author : Gopichand
Date : 11-01-2026 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit- Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం వన్డే క్రికెట్లో మాత్రమే భారత్ తరపున ఆడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్, విరాట్ ఇప్పుడే రిటైర్ అవ్వాల్సింది కాదని చాలా మంది అభిమానులు భావిస్తుంటే మాజీ భారత క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. వీరిద్దరూ రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం వన్డే క్రికెట్‌కు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
రోహిత్-విరాట్‌లపై కీలక వ్యాఖ్యలు
దేశవాళీ క్రికెట్లో పెద్ద పేరున్న ప్రియాంక్ పాంచల్.. ఈ స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. భారత సూపర్ స్టార్స్ కేవలం వన్డేలు ఆడటం వల్ల ఆ ఫార్మాట్‌కు చేకూరే ప్రయోజనాలను ఆయన వివరించారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు ఫార్మాట్ల నుండి రిటైర్ అవ్వడం మంచిదైంది. వన్డే క్రికెట్‌కు అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. 50 ఓవర్ల ఆట (వన్డేలు) దాదాపు ముగిసిపోతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో భారత ఇద్దరు అతిపెద్ద ఆటగాళ్లు కేవలం ఇదే ఫార్మాట్ ఆడటం వల్ల దీనికి కొత్త జీవం పోసినట్లయింది అని ఆయన అన్నారు.
Also Read: సింగర్ ను పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
రోహిత్-విరాట్ ఎప్పుడు రిటైర్ అయ్యారు?
టీ20 అంతర్జాతీయం: 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత రోహిత్, విరాట్ ఘనంగా వీడ్కోలు పలికారు.
టెస్ట్ క్రికెట్: ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు అకస్మాత్తుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్ నుండి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేవలం వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించాలని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలి అద్భుత ప్రదర్శన
కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 202 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సెంచరీ సాధించారు. విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఒక అర్ధ సెంచరీ చేయగా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో విజృంభించారు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా తన బ్యాట్ పదును చూపించారు.