రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!
అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచంలోని తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 648 సిక్సర్లు ఉండగా న్యూజిలాండ్‌పై 2 సిక్సర్లు బాదడం ద్వారా ఈ ఘనతను అందుకున్నారు.
- Author : Gopichand
Date : 11-01-2026 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 11న వడోదరలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాటర్‌గా ‘హిట్‌మ్యాన్’ నిలిచారు.
650 సిక్సర్ల మైలురాయి
అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచంలోని తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 648 సిక్సర్లు ఉండగా న్యూజిలాండ్‌పై 2 సిక్సర్లు బాదడం ద్వారా ఈ ఘనతను అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 29 బంతుల్లో 26 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అవుట్ అయ్యారు. భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం కోల్పోయినప్పటికీ ప్రపంచ రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
Also Read: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!
ROHIT SHARMA – 650 SIXES IN INTERNATIONAL CRICKET.
ONE & ONLY HITMAN 🥶pic.twitter.com/ENstT40dz6
— Johns. (@CricCrazyJohns) January 11, 2026
క్రిస్ గేల్ రికార్డు బద్దలు
అంతేకాకుండా వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించారు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 229 సిక్సర్లు (మొత్తం అంతర్జాతీయ సిక్సర్లు 650) పూర్తి చేసుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 10 బ్యాటర్లు
- రోహిత్ శర్మ- 650
- క్రిస్ గేల్- 553
- షాహిద్ అఫ్రిది- 476
- బ్రెండన్ మెకల్లమ్- 398
- జోస్ బట్లర్- 387
- మార్టిన్ గప్తిల్- 383
- ఎం.ఎస్. ధోని- 359
- సనత్ జయసూర్య- 352
- ఇయాన్ మోర్గాన్- 346
- ఏబీ డివిలియర్స్- 328