HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Ministers Hot Comments On Brs

Congress Ministers: ఎన్నికల‌ ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి

ఎన్నికల‌ ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల‌ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం.

  • Author : Gopi Date : 20-11-2024 - 5:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Cabinet
Telangana Cabinet

Congress Ministers: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) మ‌రోసారి ఫైర్ అయ్యారు. ముందుగా ఆరోగ్య మంంత్రి దామోద‌ర రాజ‌నర్సింహ మాట్టాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాలు నిరంకుశ పాలన చూశాం. ఆర్ అండ ఆర్ ప్యాకేజీ ‌కాంగ్రెస్ ఇచ్చింది. తిరిగి కాంగ్రెసే ఇందిరమ్మ ‌ఇండ్లు‌‌ ఇస్తుంది. ప్రతిపక్షం ‌హింస, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. పదేండ్లలలో మాటలతోనే కాలం వెల్లదీశారు. చేనేత కార్మికుల పాత బకాయిలు తీర్చుతూనే వారి జీవితాలలో వెలుగు నింపేలా చేయూత అందిస్తాం. స్కిల్ యూనివర్శిటీ ప్రారంభించాం. చేనేత సమస్యలను పరిష్కారం చూపుతామ‌న్నారు. డెభ్భై‌లక్షల మంది రైతులు పండించిన పంటలను కొంటున్నాం. దేశంలోనే మన తెలంగాణలో‌ ఈసారి ఎక్కువ పంట పండించాం. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీకి తేదీలని ప్రకటిస్తామ‌న్నారు. నేతన్నలకి, రైతన్నల కోసం పనిచేసే ప్రభుత్వం మాది అని వివ‌రించారు.

మంత్రి పొంగులేటి‌ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల‌ ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల‌ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం. పేదవాడు అయితే చాలు పార్టీలకి అతితంగా‌ ఇరవై లక్షల ఇండ్లు కట్టి తీరుతాం. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. రూ. 250 కోట్లతో మిడ్ మానేర్ ముంపు బాధితులకి‌ ఇండ్లు కట్టి తీరుతాం. ధరణి పేరుతో విదేశి సంస్థకి తాకట్టు పెట్టింది. స్వదేశి‌ సంస్థ NIC అప్ప జెప్పాం. దేశానికి రోల్ మోడల్ గా మన రాష్ట్రంలోనే రెవెన్యూ చట్టం రాబోతుందన్నారు.

Also Read: YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్‌ జగన్‌.. గంటసేపు అక్కడే?

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నిత్యాన్నదాన సత్రానికి నిధులు కెటాయించిన ముఖ్యమంత్రికి‌ ధన్యవాదాలు. శివుడుకి కూడా శఠగోపం పెట్టిన‌వాడు నాటి ముఖ్యమంత్రి. మాటల ప్రకారం ముంపు గ్రామాల పక్షాన నిలబడ్డాం. నేతన్నల సంక్షేమం ఉపాది కోసం బృహత్తర కార్యక్రమం రూపోందిస్తున్నాం. నిరంతరం వేములవాడ అలయంలో నిత్యాన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు.

మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా కాలం నుండి భక్తులు వేములవాడ అభివృద్ధి కొరకు ఎదురుచూస్తున్నారు. వేములవాడలో ఈరోజు వెయ్యి కోట్ల పనులు జరుగబోతున్నాయి. మన ప్రభుత్వం హయంలో ఏడాది కాలంలో అతి ఎక్కువ వరి పంట భారతదేశం లో పండింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క చుక్క నీరు లేకుండానే పంట పండింది. ఈసారే అతి భారీ వరి పంట పండింది. 153 లక్షల మెట్రిక్ టన్నుల వరిపంట పండింది. ఏడాది కాలంలో‌ 50000 ఉద్యోగాలు ఇచ్చాం. ప‌దుల‌ వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. చెప్పిన విధంగా రుణమాఫీ అమలు చేసాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు మరిన్ని మంజూరు చేస్తాం. సన్నరకం వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం. రెండు నెలలలో రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వబోతున్నాంమ‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • Congress Ministers
  • Minister Ponguleti
  • Minister Uttam Kumar Reddy
  • politics
  • telangana
  • telangana politics
  • telugu news
  • TG News

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • KCR support women reservation bill

    KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..

Latest News

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd