HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy With All District Collectors

CM Revanth Reddy: రేష‌న్ కార్డుల‌పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు!

రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు.

  • Author : Gopi Date : 21-07-2025 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ‌లో వర్షాల పరిస్థితులు, వ్యవసాయ రంగం, రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ.. జూన్ నుండి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే 150 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సమన్వయం చేసుకుని ముందే బృందాలను పంపిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్‌లో ఉండాలని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని, అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ప్రతిరోజు తమ కార్యాచరణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.

Also Read: Rajya Sabha: జాతీయ సైబర్ భద్రత బలోపేతంపై రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన!

రాష్ట్రం 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి సరైన వాటర్ మేనేజ్‌మెంట్ ఉండాలని సూచించారు. యూరియా స్టాక్‌కు సంబంధించి ప్రతి ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని, స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు ఎరువుల కొరత ఉన్నట్లు కృత్రిమంగా సృష్టిస్తున్నారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని స్పష్టం చేశారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని నొక్కి చెప్పారు. ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలని, ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • District Collectors
  • heavy rains
  • ration cards
  • telangana
  • TG News

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Heavy rain warning for AP...

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd