HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Decided On Another Matter

CM Revanth: సీఎం రేవంత్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాటిపై ఉక్కుపాదం!

ప్ర‌భుత్వంలోని నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో చేప్ట‌టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుంచే ఇసుక స‌ర‌ఫ‌రా చేసేలా చూడాల‌న్నారు.

  • Author : Gopi Date : 01-03-2025 - 6:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: ఇసుక‌తో పాటు ఇత‌ర ఖ‌నిజాల అక్ర‌మ త‌వ్వ‌కాలు, అక్ర‌మ స‌ర‌ఫ‌రాపై ఉక్కుపాదం మోపాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సూచించారు. క‌ఠిన చ‌ర్య‌ల‌తోనే అక్ర‌మాల‌ను అడ్డుకోగ‌ల‌మ‌ని, ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచ‌గ‌ల‌మ‌న్నారు. గ‌నుల శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత గ‌త నెల రోజులుగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో ఇసుక అక్రమ ర‌వాణాకు అడ్డుక‌ట్ట ప‌డిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇసుక రీచ్‌ల్లో త‌వ్వ‌కాలు, ర‌వాణా, వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధికారుల‌కు ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ప్ర‌భుత్వంలోని నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో చేప్ట‌టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుంచే ఇసుక స‌ర‌ఫ‌రా చేసేలా చూడాల‌న్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేప‌ట్టే నిర్మాణ రంగ సంస్థ‌లకు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను టీజీ ఎండీసీ ద్వారానే స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌రైన ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తే అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేసే వారిపై వినియోగ‌దారులు ఆధార‌ప‌డ‌ర‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువ‌గా వినియోగం జ‌రుగుతోంద‌న్నారు. త‌క్కువ మొత్తంలో ఇసుక అవ‌స‌ర‌మైన వారు కొనుగోలు చేసేలా న‌గ‌రానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: SLBC: ఎల్ఎల్బీసీలో గ‌ల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోంది: మంత్రి

గ‌నుల శాఖ ప‌రిధిలోని వివిధ ఖ‌నిజాల క్వారీల‌కు గ‌తంలో విధించిన జ‌రిమానాలు, వాటి వ‌సూళ్ల‌పైనా సీఎం అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ఇందుకు సంబంధించిన‌ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం త్వ‌ర‌గా తీసుకొని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న మైన‌ర్ ఖ‌నిజాల బ్లాక్‌ల వేలానికి వెంట‌నే టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, టీజీఎండీసీ ఛైర్మ‌న్ ఈర‌వ‌త్రి అనిల్ కుమార్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, రాష్ట్ర గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ కె.శ‌శాంక‌, గ‌నుల శాఖ కార్య‌ద‌ర్శి ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్, పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • Congress Govt
  • hyderabad
  • Sand Policy
  • telangana
  • telugu news

Related News

Maruthi

Maruti Suzuki : మారుతి సుజుకి సరికొత్త రికార్డు.. ఒకే రోజులో 108 ఇ-విటారా కార్ల డెలివరీ

మారుతి సుజుకి యొక్క అత్యాధునిక HEARTECT-e ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఇ-విటారా, ఒకసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని (డ్రైవింగ్ రేంజ్) కలిగి ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 49 kWh మరియు 61 kWh అనే రెండు బ్యాటరీ

  • Obesity Hyd

    Obesity : హైదరాబాద్‌కు ఒబేసిటీ సెగ.. నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న ఊబకాయం!

  • Prostate Cancer

    Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • Kerala Cm Vijayan, Telangan

    TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • Hotels Supplying Food Eaten

    Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

Latest News

  • IPL రూల్ బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డ RR మేనేజర్

  • YCP : వైసీపీ నుండి బ్యాడ్ క్యారెక్టర్స్ వెళ్లిపోయారంటూ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • Vishnu Priya : సోషల్ మీడియా లో విష్ణుప్రియ హాట్ ఫొటోస్..పోలీసులు కేసు నమోదు

  • ఐపీఎల్‌ 2026లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డు.. సీజన్‌లో తొలి సెంచరీ నమోదు!

  • దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు!

Trending News

    • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd